Begin typing your search above and press return to search.
వైఎస్.. దానకర్ణుడు అన్న ఉద్యమనేత
By: Tupaki Desk | 5 Jun 2017 8:41 AM GMTతన ఉద్యమాలతో ప్రభుత్వాల గుండెల్లో గుబులు పుట్టించగల సమర్థుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ.. ఎలాంటి బెరుకు లేకుండా వ్యాఖ్యానించటం ఆయనకో అలవాటుగా చెప్పాలి. తాజాగా ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పై ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్ ను ఇంచుమించు దానకర్ణుడిగా పోల్చిన ఆయన.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నేతగా వైఎస్ ను అభివర్ణించారు.
నిత్యం సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టారన్న ముద్రగడ.. మరో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సైతం గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు. ఎన్టీఆర్.. వైఎస్ లు తప్ప మరే ముఖ్యమంత్రి కూడా తనను అంతగా ఆకట్టుకోలేదన్నారు.
ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ.. ఆయన విమర్శలు గుప్పించారు. గంటల కొద్దీ మీటింగ్‌లు పెట్టే చంద్రబాబు వల్ల అవుట్ పుట్ ఏ మాత్రం ఉండదన్నారు. సొల్లు చెప్పటానికే ఆయన నటిస్తారంటూ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
చెప్పిందే చెప్పటం చంద్రబాబుకు ఉన్న ఒక అలవాటన్న ముద్రగడ.. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. కాపు రిజర్వేషన్ల మీద ఏపీ సీఎం చంద్రబాబు తీరు మీద అసంతృప్తితో ఉన్న ముద్రగడ త్వరలో తాను పాదయాత్ర చేయనున్నట్లుగా వెల్లడించారు. తన స్వస్థలం కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ముద్రగడ ఒక్కసారి ఉద్యమ బాటలో నడిస్తే.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోతుందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి.. ఈ వేడిని ఏపీ ముఖ్యమంత్రి ఎలా డీల్ చేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/