Begin typing your search above and press return to search.

కేసీఆర్ సూప‌ర్ అంటున్న ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   17 April 2017 6:37 AM GMT
కేసీఆర్ సూప‌ర్ అంటున్న ముద్ర‌గ‌డ‌
X
మైనార్టీలు - ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఊహించ‌ని ప్ర‌శంస ద‌క్కింది. కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేసీఆర్‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. అదే స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈమేర‌కు ముద్ర‌గ‌డ ఒక బహిరంగ లేఖ రాశారు.

``తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు. ఎన్నికల సమయంలో మీ తెలంగాణా రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా తక్కువ సమయంలో అమలు చేసారు. మీరు అన్నట్లు ఎటువంటి దర్నాలు - రాస్తారోకోలు - నిరస‌న కార్యక్రమాలు లేకుండా చేయడం చాలా గొప్ప విషయం. సుప్రీంకోర్డు గౌరవప్రధాన న్యాయమూర్తిగారు పేర్కొన్నట్లుగా ఎన్నికల మేనిపెస్టోలు చిత్తు కాగితాలు కాదని దేశంలో మీరు మాత్రమే రుజువు చేసారు. గిరిజన సోదరులకు రిజర్వేషను శాతం పెంచడం, ముస్లిం సోదరులుకు బీసీ రిజర్వేషను ఇవ్వడం కోసం రెండు కమిషన్లు వేయడం - రిపోర్టు తెప్పించుకుని కేబినెట్ లో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటం చూస్తోంటే అణగారిన వర్గాలకు రిజర్వేషనులు కోసం పాటు పడ్డ దళిత మహానుభావుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో మీ ప్రయాణం మరువలేనిది`` అని ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు చుర‌క అంటించారు. ``మనల్ని నమ్మి ఓట్లు వేసిన గౌరవ ఓటర్లను గౌరవించాలి వారిని మా గౌరవ ఏపీ ముఖ్యమంత్రి గారి మాదిరిగా ఇచ్చిన హామీలు అడిగితే లారీలతో కొట్టించడం - అక్రమ కేసులు పెట్టి బాధించడం - లంజల్లారా - లంజాకొడకల్లారా అని తిట్టించే కార్యక్రమం తీసుకోకండి. "పదవులు - ఆస్తులు - జీవితాలు శాశ్వతం కాదండి పేరు ప్రతిష్టలే శాశ్వతం", ప్రజల అవసరాలను గుర్తించి పూర్తిగా న్యాయం చేయండి ఎన్నికలలో గౌరవ ఓటర్లను డబ్బుకి - మద్యానికి బానిస‌లను చేయకుండా - ఖర్చులేని ఎన్నికలు చేయడానికి ప్రయత్నం చేయండి. మా గౌరవ ఏపీ ముఖ్యమంత్రి గారి వలే కోట్ల ఖర్చు చేసే విధానం పాటించకండి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి, దేశంలోనే మొట్ట మొదటి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు. అలాగే రూపాయి ఖర్చులేని ఎలక్షన్లు చేసారు అనే పేరు కూడా తెచ్చుకోండి, శాశ్వతంగా ప్రజలు గుండెల్లో నిలవండి మీ పాలనకు నా అభినందనలు. నమస్కారములతో..ముద్రగడ పద్మనాభం` అంటూ స‌ల‌హాలు సైతం ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/