Begin typing your search above and press return to search.
మరణించాక ఆయన గుండె అరగంట కొట్టుకుందట
By: Tupaki Desk | 6 Jun 2016 6:02 AM GMTశరీరంలోని భాగాలన్నీ పని చేయటం మానేశాయి.. ఒక్క గుండె తప్ప. ఈ అరుదైన ఘటన ప్రఖ్యాత బాక్సర్ మహ్మద్ అలీ విషయంలో జరిగింది. ఆ లెజెండ్ చివరిక్షణాల్లో జరిగిన ఘటన గురించి ఆయన కుమార్తె హనా స్వయంగా వెల్లడించారు. తన తండ్రి చివరి క్షణాల గురించి వెల్లడించిన ఆమె.. శరీరంలోని అన్ని భాగాలు పని చేయటం లేదని వైద్యులు చెప్పారని.. కాకుంటే ఒక్క గుండె మాత్రం అరగంట పాటు కొట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
‘‘ప్రస్తుతం మా గుండెలు వేదనతో నిండిపోయి ఉన్నాయి. నాన్న స్వేచ్ఛా జీవి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాన్న ఆఖరి క్షణాల్లో దృఢంగా నిలవటానికి ప్రయత్నిస్తున్నాం. ఆయన చెవిలో.. ఇక మీరు వెళ్లొచ్చు.. మాకేం ఫర్లేదని చెప్పాం. అయితే.. ఆయన శరీరంలోని అన్ని భాగాలు పని చేయటం మానేసినా.. గుండె మాత్రం 30 నిమిషాలు కొట్టుకుంది. ఇలాంటిది ఎవరూ చూసి ఉండరు. ఆయన పోరాట స్ఫూర్తిని.. మానసిక దృఢత్వానికి ఇదో నిదర్శనం’’ అని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉంటే మహ్మద్ అలీ అంత్యక్రియలు ఆయన మరణించిన నాలుగు రోజుల తర్వాత జరగనున్నాయి. అతడి సొంత నగరమైన లూయిస్ విల్లీలో ఇస్లాం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని అతడి కుటుంబం నిర్ణయించింది. అలీ అంత్యక్రియలకు ఎవరైనా రావొచ్చని.. ఎలాంటి పరిమితులు లేవని అలీ కుటుంబం పేర్కొంది. అంత్యక్రియ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో సహా పలువురు ప్రముఖులు హాజరు కావొచ్చని భావిస్తున్నారు.