Begin typing your search above and press return to search.
మహ్మద్ ప్రవక్తను ఫాలో అవ్వాలన్న సంఘ్ నేత
By: Tupaki Desk | 7 Jun 2017 4:50 AM GMTఆర్ ఎస్ ఎస్ నేత మహ్మద్ ప్రవక్త గురించి మాట్లాడటం ఏమిటంటారా? దీనికి కారణం లేకపోలేదు. సంఘ్ కు ముస్లిం శాఖ కూడా ఉంది. దాన్ని ముస్లిం రాష్ట్రీయ మంచ్ అనే పేరుతో వ్యవహరిస్తుంటారు. ముస్లింలను పెద్ద ఎత్తున సంఘ్ పరివారంలో చేర్చటమే దీని లక్ష్యం. ఇంతేనా.. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ నెలలో.. పెద్ద ఎత్తున విందుల్ని కూడా ఏర్పాటు చేస్తుంటారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీ ప్రభుత్వాలు రంజాన్ సందర్భంగా నిర్వహించే విందులకు చాలావరకూ చెల్లుచీటీ ఇస్తే.. సంఘ్ మాత్రం అందుకు భిన్నంగా విందులు ఇస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంఘ్ నేత ఇంద్రేష్ కుమార్ కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
మాంసం వ్యాధి అని.. పాలు ఔషధమన్నది ఆయన వాదన. ఆ విషయాన్ని తాను చెప్పలేదని.. ముస్లింలు అంతా ఆరాధించే మహ్మద్ ప్రవక్త చెప్పినట్లుగా ఆయన చెబుతున్నారు. మహ్మద్ ప్రవక్త కానీ ఆయన వారసులు కానీ మాంసాన్ని వినియోగించలేదని చెబుతూ.. భారతీయ ముస్లింలు ఎవరూ మాంసాహారాన్ని తీసుకోకూడదని చెప్పారు.
షెర్బత్ లోనూ ఆవుపాలు చేర్చాలన్న ఆయన.. దేశంలోని ముస్లింలకు సంఘ్ ముస్లిం విభాగం మూడు వినతులు చేస్తున్నట్లు చెప్పారు.
అందులో ఒకటి.. రంజాన్ మాసంలో వారి ఇంటికి దగ్గరున్న ప్రాంతాల్లో.. దరగాలు.. మసీదుల దగ్గర మొక్కలు నాటాలన్నారు. రెండు.. ముస్లింల ఇళ్లల్లో తులసి మొక్కను ఉంచాలని.. ఆరేబియన్ లో తులసి మొక్కను రెహన్ అంటారని.. దానర్థం స్వర్గం చేరే అదృష్టాన్ని ఇస్తుందంటారని చెప్పారు. అందుకే.. తులసి మొక్కను ఇళ్లల్లో ఉంచాలన్నారు. మూడోది.. మహ్మద్ ప్రవక్త.. ఆయన వారసులు ఎవరూ ఏనాడు మాంసాన్ని ముట్టుకోలేదని.. దాన్ని ముస్లింలంతా ఫాలో కావాలని కోరారు. మరి.. దీనిపై ముస్లిం మత పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/