Begin typing your search above and press return to search.

సీఎం హోదాలో స‌చివాల‌యానికి జ‌గ‌న్ ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   7 Jun 2019 10:39 AM GMT
సీఎం హోదాలో స‌చివాల‌యానికి జ‌గ‌న్ ఎప్పుడంటే?
X
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. దాదాపు ఎనిమిది రోజ‌లు క్రితం ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్‌.. త‌న కేబినెట్ ను ఏర్పాటు చేయ‌ని సంగ‌తి తెలిసిందే. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే సీఎంగా త‌న స‌త్తా చాటిన జ‌గ‌న్‌.. త‌న‌దైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

ప‌వ‌ర్లోకి వ‌చ్చిన వెంట‌నే మంత్రుల్ని ఏర్పాటు చేసే తీరుకు భిన్నంగా.. సోలోగా సీఎం హోదాలో రాష్ట్ర పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టించ‌టం ద్వారా.. త‌న స‌త్తా ఏమిట‌న్న విష‌యాన్ని పార్టీ నేత‌ల‌కు తెలిసేలా చేశార‌ని చెప్పాలి. ఇక‌.. ముందుగా డిసైడ్ చేసిన‌ట్లు జూన్ 8న మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారానికి ముందే ముఖ్య‌మంత్రి హోదాలో ఏపీ స‌చివాల‌యంలో అడుగు పెట్ట‌నున్నారు. ఇందుకు ముహుర్తాన్ని పెట్టేశారు. శ‌నివారం ఉద‌యం 8.39 గంట‌ల వేళ‌లో సీఎం హోదాలో ఏపీ స‌చివాల‌యానికి తొలిసారిగా రానున్నారు జ‌గ‌న్‌. సెక్ర‌టేరియ‌ట్ లోని మొద‌టి బ్లాక్ లో ఉన్న త‌న కార్యాల‌యంలో ఆయ‌న ప‌ని మొద‌లు పెట్ట‌నున్నారు.

ఇక‌.. ఉద‌యం 11.49 గంట‌ల స‌మ‌యంలో మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ముహుర్తాన్ని పెట్టేశారు. స‌చివాల‌యం స‌మీపంలోనే మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ఉంటుంద‌ని.. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం కార్య‌క్ర‌మం పూర్తి అయిన వెంట‌నే తొలి కేబినెట్ భేటీ జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం జ‌రిగే ప్రాంగ‌ణాన్ని పోలీసు ఉన్న‌తాధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. వీలైనంత సింఫుల్ గా ఈ కార్యక్ర‌మాన్ని పూర్తి చేయాల‌ని.. హంగు.. ఆర్భాటం పెద్ద‌గా వ‌ద్ద‌న్న విష‌యాన్ని అధికారుల‌కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం త‌ర్వాత నిర్వ‌హించే కేబినెట్ మీటింగ్ లో ప్ర‌భుత్వాన్ని ఎలా న‌డ‌పాల‌న్న విషయంపై త‌న ఆలోచ‌న‌ల్ని వివ‌రించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.