Begin typing your search above and press return to search.
తరలింపులో కొత్త ముహూర్తం తప్పదా?
By: Tupaki Desk | 21 July 2016 7:31 AM GMTనవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలోని కార్యాలయాల తరలింపు ప్రక్రియ విడత విడతలుగా సాగుతోంది. వెలగపూడి సచివాలయానికి రెండో విడతగా ఈ రోజు మరో మూడు శాఖల ఉద్యోగులను తరలించనున్నారు. ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో రవాణా - రోడ్లు - భవనాలశాఖ - విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని ప్రారంభిస్తారు.
కాగా ఈ ఉద్యోగుల తరలింపు ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. నిజానికి జూన్ 29కల్లా ఐదో బ్లాక్ లో కార్యాలయాలు ఏర్పాటవుతాయని భావించారు. అయితే పంచాయతీరాజ్ - గృహ నిర్మాణశాఖలకే పరిమితం కావలసి వచ్చింది. ఆ తరువాత ఈ నెల 11- 13 తేదీలలో రెండో ముహూర్తాన్ని సీఆర్డీయే అధికారులు నిర్ణయించారు. అప్పటికీ పనులు పూర్తికాక పోవడంతో సచివాలయ ఉద్యోగ సంఘాల విజ్ఞాపన మేరకు ఈనెల 21 - 29 తేదీలకు మరోసారి తరలింపు వాయిదా పడింది.
ప్రస్తుతం సచివాలయ భవనాలలో ఐదో బ్లాక్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. కాగా మిగిలిన నాలుగు బ్లాకులకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ పనులే ఇంకా పూర్తికాలేదు. వీటిని నెలాఖరులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలను సీయం ఆదేశించారు. ఈనెల 26 నాటికి మరో రెండు భవనాలు అవుతాయని అధికారులు చెప్తున్నారు. ఆవి పూర్తయితేనే 29వ తేదీ ముహూర్తానికి మరిన్ని శాఖలు వస్తాయి. లేదంటే మళ్లీ కొత్త ముహూర్తం పెట్టుకోవాల్సిందే.