Begin typing your search above and press return to search.
నగర శివారులో ఆంకుల్స్ రేవ్ పార్టీ
By: Tupaki Desk | 29 Feb 2016 4:20 AM GMTకుర్రపిల్లలు ఉత్సాహంతో రేవ్ పార్టీ చేసుకోవటం.. అనక బుక్ కావటం లాంటివి చోటుచేసుకున్నప్పుడు కాస్త మాట్లాడుకున్నా.. కుర్రతనంతో ఇలాంటివి చేశారనుకోవచ్చు. కాస్త బాధ్యత కానీ మీద పడితే.. ఇలాంటివి ఉండవనుకోవచ్చు. కానీ.. ఈ మధ్యకాలంలో బయట పడుతున్న రేవ్ పార్టీల తీరుతెన్నులు చూస్తే.. కుర్రాళ్లే కాదు.. పెద్ద వయస్కులు కూడా రేవ్ పార్టీల కక్కుర్తి చూస్తే విస్మయం చెందక తప్పదు.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. నగరు శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని రవి ఫామ్ హైస్ లో కొందరు అంకుల్స్ కలిసి రేవ్ పార్టీ పెట్టుకున్నారు. కొంతమంది డ్యాన్సర్లను తెచ్చుకొన అసభ్యంగా డ్యాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చట్టవిరుద్ధమైన ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు అమ్మాయిలు.. పదిమంది అంకుల్స్ తో పాటు.. ముగ్గురు నిర్వాహకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
అవసరానికి మించిన హుషారు కోసం ప్రయత్నిస్తే.. ఇలాంటి తలనొప్పులు ఖాయం. ఆ విషయం ఇప్పుడా అంకుల్స్ కు బాగానే అర్థమై ఉంటుంది. ఈ మధ్యనే జీహెచ్ఎంసీకి చెందిన కొందరు ఉద్యోగులు సైతం ఇదే తరహాలో రేవ్ పార్టీ చేసుకుంటూ అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఉద్యోగాలకు సైతం ఎసరు తెచ్చుకోవటం గమనార్హం. చట్టవిరుద్ధమైన పనుల్లో ఎంజాయ్ మెంట్ వెతుక్కుంటే ఇలాంటి తిప్పలు తప్పవనే చెప్పాలి.