Begin typing your search above and press return to search.
అంబానీ బ్రదర్స్..వెరైటీ లీడర్స్
By: Tupaki Desk | 23 July 2018 6:02 AM GMTదేశీయ వ్యాపార దిగ్గజాలైన అంబానీ బ్రదర్స్‌ను `వెరైటీ` అనడం ఏంటి...పైగా లీడర్లు అని పేర్కొంటూ ప్రస్తావించడం ఏంటి అని ఆలోచించకండి. నిజంగా వాళ్లు వెరైటీ లీర్లే. ఈ మాట చెప్తున్నది మేం కానేకాదు. వెరైటీ మ్యాగజైన్ అనే పత్రిక ఈ జాబితాను రూపొందించింది. ప్రపంచ వినోద పరిశ్రమ రూపురేఖల్ని మార్చగలిగిన సత్తా ఉన్న 500 మంది అగ్ర నాయకులతో వెరైటీ మ్యాగజైన్ జాబితాను రూపొందించింది. ఈ టాప్-500 గ్లోబల్ లీడర్లలో బిలియనీర్ సోదరులైన ముకేశ్ అంబానీ - అనిల్ అంబానీలకు చోటు దక్కింది. ఏటా విడుదలయ్యే ఈ జాబితా కోసం వెరైటీ ఎడిటోరియల్ బోర్డు ప్రపంచ సినీ - టెలివిజన్ పరిశ్రమ పోకడల్ని నిశితంగా గమనిస్తుంది. ఆ తర్వాత అత్యంత ప్రభావశీలురతో లిస్టును సిద్ధం చేస్తుంది. ఆ జాబితాలోనే వీరికి చోటు దక్కింది.
ఈ టాప్-500 గ్లోబల్ లీడర్లలో బిలియనీర్ సోదరులైన ముకేశ్ అంబానీ - అనిల్ అంబానీలతో పాటుగా మొత్తం 12 మంది భారతీయులకు ఈ ప్రతిష్ఠాత్మక లిస్టులో స్థానం లభించింది. వీరిలో అంబానీలతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ - ప్రముఖ నటి ప్రియాంక చోప్రా - రచయిత - దర్శకుడు కరణ్ జోహార్ - స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ - ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర - యశ్ రాజ్ ఫిల్మ్స్ చైర్మన్ ఆదిత్యా చోప్రా - బాలాజీ టెలీఫిల్మ్స్ జాయింట్ ఎండీ ఎక్తా కపూర్ - జీ ఎంటర్ టైన్ మెంట్ సీఈవో పునీత్ గోయెంకా - ఏరోస్ ఇంటర్నేషనల్ సీఈవో కిశోర్ లుల్లా - ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు సిద్ధార్థ్ కపూర్ ఉన్నారు. డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ను ముకేశ్ అంబానీ తన రిలయన్స్ జియోతో షేక్ చేస్తున్నారని, 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని వెరైటీ మ్యాగజైన్ ఈ సందర్భంగా తెలిపింది. జియో రాకతో ఇంటర్నెట్ చౌకగా మారిందని, దాని వినియోగం కూడా పెరిగిపోయిందని - ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో ఓ నవ శకానికి జియో నాంది పలికిందని కీర్తించింది. అనిల్ అంబానీ సైతం మీడియా - ఎంటర్ టైన్ మెంట్ రంగంలో దూకుడును ప్రదర్శించారని - అటు సినిమా - ఇటు టెలివిజన్ విభాగాల్లో తనదైన ముద్ర వేసినట్లు చెప్పింది. ఆడ్ ల్యాబ్స్ కొనుగోలుతోపాటు - స్టీవెన్ స్పీల్ బర్గ్ డ్రీమ్ వర్క్స్ లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని గుర్తుచేసింది. అయితే, అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి మీడియా తదితర ఆస్తులను అమ్మేస్తున్న విషయాన్నీ ప్రస్తావించింది.
ఇక బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ కు విపరీతమైన క్రేజ్ ఉందన్న వెరైటీ మ్యాగజైన్.. తన అందం - అభినయంతో ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని తెలిపారు. ఇదిలాఉంటే తాజా జాబితాలో వాల్ట్ డిస్నీ కంపెనీ చైర్మన్ - సీఈవో రాబర్ట్ ఐగర్ తొలి స్థానంలో నిలిచారు. వాల్డ్ డిస్నీ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తాయన్న విషయం తెలిసిందే. వాండా మీడియా గ్రూప్ చైర్మన్ జైన్లీన్ వాంగ్ - సోనీ కార్ప్ చైర్మన్ కాజ్ హిరాయ్ - హాలీవుడ్ కు చెందిన అన్నపూర్ణ పిక్చర్స్ వ్యవస్థాపకురాలు మెగన్ ఎల్లీసన్ - యూట్యూబ్ సీఈవో సుసన్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు.