Begin typing your search above and press return to search.
అంబానీ కేసు : వాజే హైఎండ్ బైక్ స్వాధీనం .. కీలక ఫుటేజ్ లభ్యం
By: Tupaki Desk | 6 April 2021 9:56 AM GMTప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్ధాల కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే విషయంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఐదు రోజుల అనంతరం ఆయన జాయింట్ అకౌంట్ నుంచి రూ.26.50 లక్షలు విత్ డ్రా అయినట్లు ఎన్ ఐఏ కోర్టుకు వెల్లడించింది. కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, వీటిని అధ్యయనం చేసేందుకు సమయం కావాలని ఎన్‌ఐఏ కోరడంతో వాజే కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 7వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే .. వాజేకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్‌ను స్వాధీనం చేసుకుంది. దీనితో ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ, వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా ఈ బైక్ కూడా చేరింది.
అలాగే, సచిన్ వాజే తో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్ ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్ ను కూడా శోధించినట్లు ఎన్ ఐఏ అధికారులు తెలిపారు. అలాగే కీలకమైన సిసిటివి ఫుటేజ్ ను కూడా సాధించింది. సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు సీన్ రీక్రియేషన్ కోసం అయన థానే వెళ్లారు. ఆ తర్వాత మార్చి 5 న థానేలోని కల్వా లేక్ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్ ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి ఎస్ యూవీని పార్కింగ్ చేయడంలో వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి విదితమే.