Begin typing your search above and press return to search.

అంబానీ ఇంటి ఎదుట కారు బాంబు కేసులో ట్విస్ట్

By:  Tupaki Desk   |   16 Jun 2021 8:30 AM GMT
అంబానీ ఇంటి ఎదుట కారు బాంబు కేసులో ట్విస్ట్
X
దేశంలోనే అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ముందు కారు బాంబు కేసు అనూహ్య మలుపుతిరిగింది. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు ఎన్ఐఏ అధికారులు. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా ఈ ఇద్దరి పేర్లు వెలుగులోకి వచ్చినట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు.

జూన్ 11న ఈ కేసులో మలాద్ సబర్బన్ నుంచి సంతోషెలార్, ఆనంద్ జాదవ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అంబానీ ఇంటి ముందు కారుబాంబు నిలపడం వెనుక జరిగిన కుట్రలో ఈ ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని వారు తెలిపారు. ప్రత్యేక కోర్టు ఈ ఇద్దరినీ జూన్ 21 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించిందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు.

మరోవైపు థానేకి చెందిన వ్యాపారవేత్త, కారుబాంబుల కోసం వినియోగించిన ఎస్.యూ.వీ కారు యజమాని మన్సుఖ్ హీరేన్ హత్య వెనుక షెలార్, జాదవ్ పాత్రం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే డిస్మస్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలు ఉంచిన వాహనం యజమాని హిరేన్ మార్చి 5న థానేలో అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురు పోలీసులను , క్రికెట్ బూకీని అరెస్ట్ చేశారు.