Begin typing your search above and press return to search.

'క‌త్తులు' దూసుకునే కార్పొరేట్ దిగ్గ‌జాలు క‌లిస్తే..

By:  Tupaki Desk   |   28 Sep 2017 7:39 AM GMT
క‌త్తులు దూసుకునే కార్పొరేట్ దిగ్గ‌జాలు క‌లిస్తే..
X
నిత్యం వ్యూహాల‌ క‌త్తులు దూసుకునే ఇద్ద‌రు కార్పొరేట్ దిగ్గ‌జాలు ఒకే వేదిక మీద‌కు వ‌స్తే ఎలా ఉంటుంది? తీవ్ర‌మైన పోటీతో న‌డిచే వారిద్ద‌రు ఎదురుప‌డితే ఎలా ఉంటుంది? వారిద్ద‌రు మాట్లాడిన‌ప్పుడు ఏం మాట్లాడ‌తారు? ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ఎవ‌రు అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

డేటా.. కాల్‌ మార్కెట్ లీడ‌ర్ అయిన ఎయిర్ టెల్‌కు త‌న ఎంట్రీతో చుక్క‌లు చూపించ‌ట‌మే కాదు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా జియోతో షాకిచ్చిన కార్పొరేట్ దిగ్గ‌జం రిల‌య‌న్స్ అధినేత‌ ముకేశ్ అంబానీ. జియో కార‌ణంగా తీవ్ర పోటీ ఎదుర్కొన‌ట‌మే కాదు.. మార్కెట్ లీడ‌ర్ స్థానాన్ని కోల్పోయిన భార‌తీ ఎయిర్ టెల్ అధిప‌తి సునీల్ మిట్ట‌ల్ ఇద్ద‌రూ ఒకే వేదిక మీద క‌లిస్తే ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని తాజాగా మొద‌లైన ఇండియా టెలికాం కాంగ్రెస్ చూపించేసింది.
గ‌డిచిన కొంత‌కాలంగా భార‌తీ ఎయిర్ టెల్‌.. రిల‌య‌న్స్ జియోలు పోటాపోటీగా త‌ల‌ప‌డుతున్న‌వైనం అంద‌రికి తెలిసిందే. వీరి మ‌ధ్య వ్యాపార పోరు హోరాహోరీగా సాగుతోంది.

పోటాపోటీ ఆఫ‌ర్ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. ఇలాంటి వేళ వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న వ్యాపార పోరు నేప‌థ్యంలో ఇద్ద‌రు ఎదురుప‌డితే ఇద్ద‌రూ ఎలా రియాక్ట్ అవుతార‌న్న సందేహం ప‌లువురిలో ఉంది. దీన్ని తీర్చేసింది ఇండియా టెలికాం కాంగ్రెస్‌. ఇద్ద‌రూ ఒకే వేదిక‌ను పంచుకున్న వేళ‌.. ఇరువురు క‌ర‌చాల‌నం చేసుకోవ‌టం అంద‌రిని ఆక‌ర్షించింది.

అనంత‌రం రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. సునీల్ మిట్ట‌ల్ త‌న‌కు మంచి స్నేహితుడ‌ని అభివ‌ర్ణించుకున్నారు. దీనికి ప్ర‌తిగా ఎయిర్ టెల్ అధిప‌తి సునీల్ మిట్ట‌ల్ మాట్లాడుతూ త‌న‌కు ప్రియ‌త‌మ మిత్రుడిగా ముకేశ్ అంబానీని అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రూ ఇలా మాట్లాడుకొని అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటే.. కేంద్ర టెలికాం మంత్రి మ‌నోజ్ సిన్హా మాట్లాడుతూ.. రెండు కంపెనీలు (జియో.. ఎయిర్ టెల్) మ‌ధ్య ఆరోగ్య‌క‌ర పోటీతో వినియోగ‌దారుడు ల‌బ్థి పొందిన‌ట్లుగా పేర్కొన్నారు. మంత్రి మాట‌ల్ని ప‌క్క‌న పెడితే ఇద్ద‌రు కార్పొరేట్ దిగ్గ‌జాలు ఒక‌రినొక‌రు పొగుడుకున్న వైనం మాత్రం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది.