Begin typing your search above and press return to search.
2033 నాటికి ముకేశ్ అంబానీ ఆస్తి ఎంత అవుతుందంటే?
By: Tupaki Desk | 16 May 2020 8:10 AM GMTమిలియనీర్ ఎప్పటి మాటనో. బిలియనీర్ ఇప్పటికి కాస్త కష్టమైన విషయమే. అయితే.. ఇటీవల కాలంలో మరో కొత్త మాట వినిపిస్తోంది. అదే.. ట్రిలియనీర్. అదేమిటంటారా? సింపుల్ గా చెప్పాలంటే.. లక్ష కోట్ల డాలర్లు. గడిచిన కొన్నేళ్లుగా లక్ష కోట్ల సంపాదన చాలా కామన్ అయిపోయింది. కానీ.. ఆ లక్ష కోట్లు రూపాయిల్లో కాకుండా డాలర్లలో అంటే మాత్రం.. వెంటనే సమాధానం చెప్పలేరు.
ఇప్పుడు అదే లక్ష కోట్ల డాలర్ల ఆస్తి సంపాదన కూడా సాధ్యమేనని చెబుతున్నారు. ఒక వ్యక్తి అంత భారీ మొత్తాన్ని సంపాదించగలరా? అంటే అవునే చెప్పాలి. ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ గా అమెజాన్ అధినేత బెజోస్ అవతరించనున్న విషయం ఇప్పటికే వార్తాంశంగా మారింది. మరో ఆరేళ్ల వ్యవధిలో తొలి ట్రలియనీర్ గా బెజోస్ గా అవతరిస్తే.. మన ముకేశ్ అంబానీ ఆ ఫీట్ ఎప్పటికి సాధిస్తారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్కల ప్రకారం ముకేశ్ అంబానీ ఆస్తి 53.7 బిలియన్ డాలర్లు. అది కాస్తా ట్రిలియన్ డాలర్లుగా మారటానికి కనీసం మరో పదమూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. కంపేరిజన్ అనే సంస్థ వెల్లడించిన తాజా అధ్యయనం ద్వారా ప్రపంచంలోని అపర కుబేరులు ట్రిలియనీర్లుగా ఎప్పటికి మారతారన్న దానికి సంబంధించిన ఆసక్తికర అంచనాల్ని వేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో తొలి ట్రలియనీర్ అమెజాన్ అధిపతి అయితే.. రెండో ట్రలియనీర్ గా చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం జు జియాయిన్ అవతరిస్తారని చెబుతున్నారు. అయితే.. దీనికోసం మరో ఏడేళ్లు వెయిట్ చేయక తప్పదంటున్నారు.
ఇంతకీ ఈ లెక్కను ఎలా వేశారన్న విషయంలోకి వెళితే.. .ఇటీవల కాలంలో వారి సంపద పెరుగుతున్న దాని ప్రకారం భవిష్యత్తును అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్నులైన పాతిక మంది వ్యక్తులకు సంబంధించిన ఐదేళ్ల డేటాను కంపారిజన్ లోకి తీసుకొని ఈ నివేదిక ను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం రానున్న రోజుల్లో ట్రిలియనీర్లు ఇలా అవతరిస్తారని సదరు సంస్థ అంచనా వేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2030 నుంచి 2040 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది ట్రిలియనీర్లు అవతరించనున్నట్లు పేర్కొంది.
1. జెఫ్ బెజోస్ (అమెజాన్) 2026
2. జు జియాయిన్ (ఎవర్ గ్రాండ్) 2027
3. జాక్ మా (ఆలీబాబా) 2030
4. మాహుటెంగ్ (టెన్సెంట్) 2033
5. ముకేశ్ అంబానీ (రిలయన్స్) 2033
6. బెర్నార్డ్ ఆర్నాల్డ్ (ఎల్ వీఎంహెచ్) 2033
7. మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్ బుక్) 2036
8. స్టీవ్ బామర్ (ఎక్స్ మైక్రోసాఫ్ట్) 2040
9. మైఖేల్ డెల్ (డెల్) 2043
10. ల్యారీ పేజ్ (గూగుల్) 2051
11. సెర్గీ బ్రిన్ (గూగుల్) 2051