Begin typing your search above and press return to search.

అంబానీ 35వేల కోట్లు నష్టపోయాడా?

By:  Tupaki Desk   |   1 March 2020 10:27 AM GMT
అంబానీ 35వేల కోట్లు నష్టపోయాడా?
X
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ దెబ్బకు చైనాయే కాదు.. ఇప్పుడు ప్రపంచం అల్లాడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, తయారీ పరిశ్రమ అయిన చైనా నుంచి ప్రపంచ దేశాలకు ఉత్పత్తులు పడిపోయాయి. చైనా వస్తువుల దిగుమతిని వివిధ దేశాలు నిషేధించాయి. ఇక కరోనా భయంతో కొనుగోల్లు, అమ్మకాలు నిలిచిపోయి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి.

భారత్ పై కూడా కరోనా వైరస్ ప్రభావం బాగా పడింది. దేశంలోని కుబేరుల సంపద కరిగిపోయింది. ప్రపంచంలోనే 9వ అతిపెద్ద కుబేరుడు మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. భారత దేశంలో నంబర్ 1 సంపాదనపరుడు ఈయనే. ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లు. ఈయన గంటకు రూ.7కోట్లు సంపాదిస్తారు.

అయితే కరోనా ఎఫెక్ట్ తో కుబేరుడు ముఖేష్ తోపాటు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల సంపద కరిగిపోయింది. ఫిబ్రవరి 12 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 13శాతం విలువ కోల్పోయాయి. 2019తో పోలిస్తే అంబానీ సంపద 5 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. ఇక ఈ ఎఫెక్ట్ అంబానీ మీదనే కాదు.. ఇతర పారిశ్రామికవేత్తల మీద కూడా పడింది.. ఆదిత్యబిర్లా సంపద 884 మిలియన్ డాలర్లు నష్టపోయారట.. అజీమ్ ప్రేమ్ జీ 869 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ఆయా కంపెనీల వాటాల విలువలు తగ్గాయి. దీనికంతటికి కరోనా వైరస్ ప్రభావమే కారణంగా చెబుతున్నారు. వైరస్ కారణంగా కొనుగోలు, అమ్మకాలు పడిపోవడమే రిలయన్స్ నష్టాలకు కారణంగా చెబుతున్నారు.