Begin typing your search above and press return to search.

శాంసంగ్ కంటే మొన‌గాడు మ‌నోడు

By:  Tupaki Desk   |   16 Nov 2017 11:34 AM GMT
శాంసంగ్ కంటే మొన‌గాడు మ‌నోడు
X
అంబానీ అల్లాట‌ప్పాటోడు కాదండోయ్‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ దేశంలోనే అత్యంత సంప‌న్నుడు. తాజాగా ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన డేటాతో ఇప్పుడు సీన్ మారిపోయింది. మ‌న ముకేశ్ అంబానీ ఏకంగా ఆసియా ఖండంలోనే అత్యంత సంప‌న్నుడిగా అవ‌త‌రించాడు. దేశంలో అంటే ఓకే అనుకోవ‌చ్చు. ఆసియా ఖండం అంటే సంప‌న్న‌మైన దేశాలు ఎన్నో ఉన్నాయి.

జ‌పాన్‌.. కొరియా.. చైనా లాంటి దేశాల్లో తోపుల్లాంటి పారిశ్రామిక‌వేత్త‌లు చాలామంది ఉన్నారు. వారంద‌రిని తోసిరాజంటూ లిస్ట్ లో టాప్ లో నిల‌వ‌టం అంత చిన్న ముచ్చ‌ట కాదు. తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ ఆస్తి 44.8 బిలియ‌న్ డాల‌ర్లుగా తేల్చారు. ద‌క్షిణ కొరియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కీల‌క భూమిక పోషించే శాంసంగ్ నుసైతం మ‌న అంబానీ వెన‌క్కి నెట్టేయ‌టం చూసిన‌ప్పుడు ఎంత మొన‌గాడో అర్థ‌మ‌వుతుంది.

అంబానీ త‌ర్వాతి స్థానంలో ద‌క్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ అధినేత లీ కుటుంబం చేరింది. వీరి సంప‌ద 40.8 బిలియ‌న్ డాల‌ర్లుగా తేల్చారు. అంటే.. మొద‌టి.. రెండు స్థానాల మ‌ధ్య వ్య‌త్యాసం 4 బిలియ‌న్ డాల‌ర్లుగా తేలింది. మూడో స్థానంలో హాంకాంగ్‌కు చెందిన క్వాక్ ఫ్యామిలీ నిలిచింది.

నాలుగో స్థానంలో థాయ్ లాండ్‌కు చెందిన బియ‌రావ‌నంట్ కుటుంబం నిల‌వ‌గా.. టాప్ టెన్ స్థానాల్లో మ‌రే భార‌తీయ సంప‌న్నుడికి చోటు ద‌క్క‌లేదు. ఫోర్బ్స్ విడుద‌ల చేసిన జాబితాలో భార‌త్‌కు చెందిన సంప‌న్న కుటుంబాల్లో 18 మందికి చోటు ల‌భించింది. వారిలో విప్రో ప్రేమ్ జీ(11వ స్థానం).. హిందుజా 912).. మిట్ట‌ల్ (14) మిస్త్రీ (16)ల‌తోపాటు.. గోద్రెజ్‌..బ‌జాజ్‌.. జిందాల్‌.. బ‌ర్మ‌న్‌.. లాల్‌.. బంగూర్ ఫ్యామిలీలు నిలిచాయి. ఏమైనా.. ఆసియా ఖండంలోనే అత్యంత సంప‌న్నుడు మ‌నోడు అన్న మాట గొప్ప‌గా అనిపించ‌ట్లేదు?