Begin typing your search above and press return to search.

ముకేశ్ అంబానీ ఇప్పుడంత ప‌వ‌ర్ ఫుల్

By:  Tupaki Desk   |   18 May 2017 5:43 AM GMT
ముకేశ్ అంబానీ ఇప్పుడంత ప‌వ‌ర్ ఫుల్
X
దేశీయ సంప‌న్నుల్లో అగ్ర‌స్థానాన్ని సొంతం చేసుకొని.. తాను ఏ వ్యాపారాన్ని టార్గెట్ చేసినా.. అందులో తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించే రిల‌య‌న్స్ ముకేశ్ అంబానీ తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. ప్ర‌పంచ ప‌రిశ్ర‌మ గ‌తిని మార్చిన 25 మంది అగ్ర‌స్థాయి వ్యాపార‌.. పారిశ్రామిక‌వేత్త‌ల్లో ముకేశ్ అగ్ర‌స్థానం ద‌క్కించుకోవ‌టం గ‌మ‌నార్హం. కొద్దిరోజుల క్రితం ప్ర‌వేశ పెట్టిన జియో పుణ్య‌మా అని ఆయ‌న‌కీ గుర్తింపు ల‌భించింది.

ప్ర‌ఖ్యాత ఫోర్భ్స్ ప‌త్రిక ప్ర‌క‌టించిన రెండో వార్షిక గేమ్ ఛేజింగ్ పారిశ్రామిక‌వేత్త‌ల జాబితాలో అంబానీకి స్థానం ద‌క్కింది. ఈ గుర్తింపు ఎంత కీల‌క‌మంటే.. ప్ర‌స్తుతం ఉన్న స్థాయిలో సంతృప్తి చెంద‌కుండా.. ప‌రిశ్ర‌మ‌తో పాటు కోట్లాదిమంది ప్ర‌జ‌ల జీవ‌న‌గ‌మ‌నాన్ని పూర్తిగా కొత్త దిశ‌కు మార్చిన వారిని మాత్ర‌మే ఈ జాబితాలోకి ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

అలాంటి జాబితాలో అంబానీ త‌న స్థానాన్ని ద‌క్కించుకున్నారు. భార‌త‌దేశంలో సామాన్యుడికి ఐటీని స‌న్నిహితం చేసిన ఘ‌న‌త ముఖేశ్ సొంత‌మైంది. ఆయిల్‌.. గ్యాస్ విభాగంలో దిగ్గ‌జంగా ఉన్న‌ ముకేశ్‌.. రిల‌య‌న్స్ జియో పేరిట మార్కెట్ లోకి రావ‌ట‌మే కాదు.. అత్యంత చౌక‌గా.. వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్‌ ను అందించ‌టం ద్వారా పెను సంచ‌ల‌నానికి కార‌ణ‌మ‌య్యార‌ని ప్ర‌స్తుతించింది. కేవ‌లం ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ప‌ది కోట్ల వినియోగ‌దారుల మైలురాయిని చేర‌టంలో కీల‌క భూమిక పోషించార‌ని పేర్కొంది. ముఖేష్ అంబానీ త‌ర్వాత ఇజ్రాయెల్‌ కంపెనీ మొబిల్‌ ఐకు చెందిన జివ్‌ అవిరామ్‌.. అమ్నాన్‌ షాషాలు జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. వీరే కాక జాబితాలో చోటు ద‌క్కించుకున్న‌వారిలో హోం అప్ల‌యెన్సెస్ కంపెనీ డేస‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జేమ్స్ డేస‌న్‌.. బ్లాక్ రాక్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు లారీ ఫింక్‌.. ఇవాన్ స్పీజెల్‌..సౌదీ యువ‌రాజు మ‌హమ్మ‌ద్ బిన్ సల్మాన్ త‌దిత‌రులు ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/