Begin typing your search above and press return to search.
ముకేశ్ అంబానీ కొత్త కారా మజాకానా?
By: Tupaki Desk | 25 April 2016 10:52 AM GMTసామాన్యుడికే కోటి కలలు ఉంటాయి. అలాంటిది దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి కలలు ఉండకుండా ఉంటాయా? మరి.. ఆయనలాంటి వ్యక్తి నచ్చి మెచ్చిన వస్తువులు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆసక్తికర సమాధానం అభిస్తుంది. దేశంలో తిరుగులేని పారిశ్రామికవేత్త అయిన ముకేశ్ అంబానీ ముచ్చటపడి కొనుక్కున్న విలాసవంతమైన కారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అపర కుబేరుడు లాంటి ముకేశ్ అంబానీ లాంటి వ్యక్తి ముచ్చట పడి కొన్న కారంటే ఓ రేంజ్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని రేటు చూస్తేనే ఇదెంత విలువైన కారో ఇట్టే అర్థమవుతుంది. ముకేశ్ ముచ్చట పడి కొన్న కారు విలువ జస్ట్ రూ.25కోట్లు మాత్రమే. ఈ విలాసవంతమైన కారుకు ముకేశ్ కట్టిన పన్ను ఏకంగా రూ.1.82కోట్లు కావటం గమనార్హం. నెదర్లాండ్స్ లో తయారు చేసిన ఈ కారు చూసేందుకు ఒక మినీ బస్సులా ఉంటుందని చెబుతున్నారు.
ఈ కారులో ఎక్కటానికి ఫ్లైట్ స్టెప్స్ లాంటి ప్రత్యేక ఏర్పాటు ఉంది. ఈ అత్యాధునిక కారులో సౌకర్యాలు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పటానికి ఒక్క ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు. అదేమంటే.. ఈ కారు మొత్తం కూల్ కూల్ గా కావటానికి కేవలం 22 సెకన్లు సరిపోతుందట. అంతటి అత్యున్నత సాంకేతికత ఈ కారు సొంతమట. రూ.27 కోట్ల కారంటే ఆ మాత్రం లేకుంటే ఎలా అనిపిస్తుందా..?