Begin typing your search above and press return to search.
బాబు ఐడియాను పెద్ద అంబానీ ఫాలో అయ్యారట
By: Tupaki Desk | 14 Feb 2018 5:39 AM GMTతనను తాను పొగుడుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు మరోలా చెబుతుంటారు. ఏం చేస్తాం.. బాబును సొంత పార్టీ నేతలు ఎటూ పొగడరు.. అందుకే తనను తానే పొగిడేసుకుంటుంటారని ఎద్దేవా చేస్తారు.
బాబు ఘనతను..ఆయన విజన్ ను.. ఆయన ఐడియాలు ఎంత అద్భుతంగా ఉంటాయో బయటకు చెప్పి అందరిని అశ్చర్యానికి గురి చేశారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. తరచూ తానెంత అద్భుతమో చంద్రబాబు చెబితే.. చాలామంది ఆయనపై సటైర్లు వేస్తుంటారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చే విషయంలో బాబు కష్టపడినా.. ఆ విషయాన్ని ఆయన చెప్పుకునే తీరు కామెడీ ఉంటుందన్న అభిప్రాయం పలువురిలో ఉంది.
ఇలాంటివేళ.. బాబు గొప్పతనాన్ని కీర్తించేశారు ముకేశ్ అంబానీ. ఏదో మాట వరసకు కాకుండా బాబు విజన్ ఎంత ఉంటుందన్న విషయంపై ఆయనో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. 1999లో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు జామ్ నగర్ లోని తమ రిఫైనరీని సందర్శించారని.. ఆ సందర్భంగా తన తండ్రి ధీరూబాయ్ అంబానీతో బాబు మాట్లాడుతూ.. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందన్న సలహాను తమకిచ్చినట్లుగా చెప్పారు.
దేశంలో టెలికాం రంగం ఊహించనంత ఎత్తుకు ఎదుగుతుందని.. అందులోకి మీరు రావాలంటూ తమ తండ్రి కి బాబు సలహా ఇచ్చినట్లు ముకేశ్ చెప్పారు. ఆ రకంగా చూసినా రిలయన్స్ కంపెనీ బాబుకు రుణపడి ఉండాలని బాబును ప్రశంసలతో ముంచెత్తారు.
అంతా బాగానే ఉంది కానీ.. ముకేశ్ మాట విన్నాక ఒక డౌట్ రాక మానదు. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన ఐడియా ఇచ్చేసిన చంద్రబాబు.. తన సొంత కంపెనీ అయినా హెరిటేజ్‌కు ఎందుకు ఇవ్వనట్లు? టెలికాంలో అద్భుత అవకాశాలు ఉన్న విషయాన్ని అప్పుడెప్పుడో అంచనా వేసిన బాబు.. తన సొంత కంపెనీ అయినా హెరిటేజ్ ను ఆ వ్యాపార దిశగా ఎందుకు అడుగులు వేయించనట్లు? అన్న డౌట్ రాక మానదు. అంబానీకే సలహా ఇచ్చి.. ఈ రోజున రిలయన్స్ ఎక్కడో ఉండేలా చేసిన బాబు..సొంత కంపెనీని అంత ఎత్తు ఎదిగేలా ఎందుకు చేయలేదంటారు?