Begin typing your search above and press return to search.
సోదరుడి ఆస్తిపై ముఖేష్ కన్ను
By: Tupaki Desk | 22 Dec 2017 6:02 AM GMTవ్యాపారంలో ఇక్కట్లు ఎదుర్కుంటున్న వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ విషయంలో ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇచ్చారు. అయితే అనీల్ కు సహాయం చేసేందుకు కాదు. ఆయనకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) ఆస్తులను - అన్న ముఖేష్ అంబానీ కొనుగోలు చేసేందుకు! ఇటీవలికాలంలో అగ్రజుడైన ముకేశ్ పేరు ఎక్కడ చూసినా మెరిసిపోతుంటే - అనీల్ పేరు మాత్రం అన్నింటా మసకబారుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ ఐఎల్) వ్యాపారాలు అంతకంతకూ పెరుగుతూపోతుంటే - అనీల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ అనీల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఆర్ అడాగ్) వ్యాపారాలు ఒక్కటొక్కటిగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా సోదరులిద్దరి ఆస్తుల్లో అంతరాలు అమాంతం పెరిగిపోగా - సంపద విషయంలో ముకేశ్ - అనీల్ ల మధ్య వ్యత్యాసం నింగికి.. నేలకు మధ్య ఉన్న తేడాకు చేరిందంటే అతిశయోక్తి కాదు.
వ్యాపార నిర్వహణలో అనీల్ ఇక్కట్లు ఎదుర్కోవడం, ఆయన సారథ్యంలోని ఆర్ కామ్ గడ్డుకాలంలో ఉండటంతో ఆస్తులను ముఖేష్ సారథ్యంలోని రిలయన్స్ జియో కొనుగోలు చేయబోతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఆర్ కామ్ తన అన్ని ఆస్తులను అమ్మేయాలనుకుంటే, వాటిని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో ముందంజలో ఉందని తెలుస్తోంది. రూ.19వేల కోట్ల విలువైన ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను రిలయన్స్ జియో కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతుందని, అదేవిధంగా ఆర్ కామ్ టెలికాం టవర్ పోర్ట్ ఫోలియోను దక్కించుకునే చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం.
రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఆర్‌ఐఎల్, ఆర్‌అడాగ్‌లు ఏర్పడ్డాయి. ముకేశ్‌కు చెందినది ఆర్ ఐఎల్ అవగా, అనీల్‌ది రిలయన్స్ అడాగ్. రిలయన్స్ గ్రూప్ విడిపోక ముందు పెట్రోకెమికల్స్‌ను ముకేశ్ అంబానీయే చూసుకునేవారు. టెలికం వ్యాపారాన్నీ ఒక్కరే నిర్వహించేవారు. ఆర్థికం, ఇంధనం, విద్యుత్ వ్యాపారాలను మాత్రం అనీల్ చూసేవారు. అయితే తెర వెనుక ఆస్తుల నిర్మాణంలో కీలకపాత్ర ముకేశ్‌దైతే, తెర ముందు రిలయన్స్ వ్యాపారాల ప్రచారం, మదుపరులతో ముఖాముఖీలు అనీల్ చేపట్టేవారు. ఈ క్రమంలో ఇరువురికీ వివాహాలు కావడం, తండ్రీ ధీరూభాయ్ అంబానీ చనిపోవడంతో ఆస్తుల పంపకాలు - వ్యాపార విభజన తప్పలేదు. నిజానికి కలిసి వ్యాపారం చేద్దామన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. అనీల్ ససేమిరా అనడంతో రిలయన్స్ గ్రూప్ రెండు ముక్కలైంది. తల్లి కోకిలాబేన్ విజ్ఞప్తిపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో - ఎండీ కేవీ కామత్.. ఆస్తుల పంపకానికి సలహాదారుగా ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోకెమికల్ వ్యాపారాన్ని ముకేశ్ చక్కగా నిర్వహిస్తుండటంతో అది ఆయనకే దక్కగా - ఫైనాన్స్ - ఎనర్జీ వ్యాపారాల గురించి తెలిసిన అనీల్ చేతికి అవే వచ్చాయి. టెలికం వ్యాపారం కూడా ముకేశ్‌కే రాగా - అనీల్ తనకే కావాలంటూ గట్టిగా పట్టుబట్టడంతో టెలికంను ముకేశ్ వదిలేసుకున్నారు. రూ.25,000 కోట్ల నగదునూ అనీల్ కు ఇచ్చారు. 2004 నవంబర్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముకేశ్ దీనిపై తన అసంతృప్తినీ వ్యక్తం చేశారు. తాను టెలికం వ్యాపారాభివృద్ధికి గొప్ప ప్రణాళికలు వేసుకున్నానని, అయినప్పటికీ తన చేతుల్లోంచి అది జారిపోవడం తీవ్రంగా బాధించిందని చెప్పారు.
దేశంలోకెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఆర్ ఐఎల్ దే. గుజరాత్‌లోని జామ్ నగర్ వద్దగల ఈ రిఫైనరీ వార్షిక సామర్థ్యం 33 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇక ముకేశ్ మానస పుత్రిక రిలయన్స్ జియో. ఉచిత 4జీ సేవలతో ఏడాది క్రితం దేశీయ టెలికం రంగంలోకి ప్రవేశించిన జియో.. సృష్టించిన సంచలనాలకు కొదవే లేదు. భారతీయ టెలికం రంగ ముఖచిత్రాన్నే మార్చేసిన జియో.. ఈ రంగంలో దిగ్గజ కంపెనీలకు ముచ్చెమటలు పోయించింది. జియో ధాటికి అనీల్ సారథ్యంలోని ఆర్ కామ్ కుదేలవగా - టాటా టెలీ కూడా కనుమరుగైపోయింది. దాదాపు రూ.45,000 కోట్ల రుణభారంతో టెలికం సేవలకు ఆర్ కామ్ గుడ్ బై చెప్పగా - టాటా టెలికం.. ఎయిర్ టెల్ లో విలీనమైంది. వొడాఫోన్ - ఐడియా కూడా ఒక్కటైపోతుండగా, చిన్నాచితకా సంస్థలూ భారీ కంపెనీల గూటికి చేరుతున్నాయి. స్థూలంగా అగ్రజుడు అందలంవైపు సాగుతుండగా...అనీల్ గ్రాఫ్ అంతకంతకూ క్షీణిస్తోందని అంటున్నారు.