Begin typing your search above and press return to search.

ముంబై పోలీసులకు అంబానీ పెళ్లి కానుక

By:  Tupaki Desk   |   9 March 2019 11:16 AM GMT
ముంబై పోలీసులకు అంబానీ పెళ్లి కానుక
X
రిలయన్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన గొప్పతనాన్ని మరోమారు చాటుకున్నారు. అంబానీ ఇంటా పెళ్లి వేడుకల సందర్భంగా ఇప్పటికే ముంబైలోని అనాథలకు అన్నసేవ - ఏడాదిపాటు అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సరిపడా సామగ్రిని పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాయి.

తాజాగా ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లిని పురస్కరించుకొని పోలీసులకు కానుక ఇచ్చాడు. ఇంట్లో పెళ్లి వేడుకల సందర్భంగా ముంబైలో పనిచేస్తున్న 50వేల మంది పోలీసులకు ప్రత్యేకంగా తయారుచేయించిన స్వీట్ బాక్సులను ఒక్కొక్కరికి ఒకటి చొప్పున 50వేల స్వీట్ బాక్సులను పంపిణీ చేసి ముఖేష్ అంబానీ గొప్పతనాన్ని చాటుకున్నారు.

ముకేశ్ అంబానీ కూతురు వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా మార్చి 9న ప్రముఖ వ్యాపార వేత్త రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాతో ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం జరుగనుంది. ఈ వివాహా వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అంబానీ తన ఇంట్లో పెళ్లి వేడుకకు కానుకగా పోలీసులకు స్వీట్ బాక్సులను పంపించారు. ఇప్పటికే ఈ బాక్సులు ముంబై లోని అన్ని పోలీస్ స్టేషన్ లకు చేరుకున్నాయి. దేశంలోనే అపరకుబేరుడైన ముఖేశ్ అంబానీ తమ సేవలను గుర్తుంచుకొని స్వీట్ బాక్సులు పంపించడంపై పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.