Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు షాకిచ్చిన జంపింగ్ నేత ఈయ‌నే

By:  Tupaki Desk   |   8 Aug 2018 3:55 PM GMT
కేసీఆర్‌ కు షాకిచ్చిన జంపింగ్ నేత ఈయ‌నే
X
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం నుంచి కాంగ్రెస్ పార్టీకి వ‌రుస షాకులు ఇస్తూ వ‌స్తున్న టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు మొట్ట‌మొద‌టి సారిగా కాంగ్రెస్ పార్టీ అనూహ్య‌మైన షాక్ ఇచ్చింది. గులాబీ ద‌ళ‌ప‌తి త‌మ కోట‌కు ఎర్త్ పెట్టాల‌ని చూస్తే ఆయ‌న‌కే షాక్ తగిలింది. టీఆర్ ఎస్‌ పార్టీలో చేర‌నున్న‌ట్లు క్లూ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత అనంత‌రం కేసీఆర్‌ కు ఝ‌ల‌క్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జైకొట్టారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు...మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. అలా ఝ‌ల‌క్ ఇచ్చిన వారి జాబితాలో ముఖేష్ గౌడ్‌ త‌న‌యుడు విక్రమ్ గౌడ్ కూడా ఉన్నారు. టీఆర్ ఎస్ పార్టీని నిరీక్ష‌ణ‌లో ఉంచి..రాహుల్ రాక‌కు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ టీఆర్‌ ఎస్‌ లో చేరడంతో మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్ - ఆయన కుమారుడు - మాజీ కార్పొరేటర్ విక్రంగౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచారం జరిగిన సంగ‌తి తెలిసిందే. ముఖేశ్‌ గౌడ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా టీఆర్‌ ఎస్ గ్రేటర్ నాయకుడు - ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు జాంబాగ్‌ లోని ముఖేశ్ ఇంటికెళ్లి ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ముఖేశ్‌ తో కొంతసేపు మాట్లాడిన అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మైనంపల్లి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామం అనంత‌రం జ‌రిగిన నగర కాంగ్రెస్ మీటింగ్‌ కు కూడా ముఖేష్ గౌడ్ మ‌రియు ఆయ‌న‌ త‌న‌యుడు విక్రమ్ గౌడ్ హాజరు కాలేదు. ముఖేష్ గౌడ్ పేరుకు పార్టీలో ఉన్నార‌న్నదే కానీ.. ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు ఏ ఒక్కపార్టీ కార్యక్రమంలో పాల్గొన‌డం లేదు. క‌నీసం గాంధీభ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూడ‌టంలేదు. దీంతో దానం నాగేంద‌ర్‌ కు తోడు రేపో మాపో ముఖేష్ కూడా గులాబీ గూటికి చేరుతార‌న్న చ‌ర్చ కూడా సిటి క్యాడ‌ర్‌ ను అయోమ‌యానికి గురి చేసింది.

అయితే, వీటన్నింటికీ చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగాల‌ని ముఖేష్ గౌడ్ నిర్ణ‌యించుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మరికొందరు సీనియర్ నేతలు ముఖేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించారు. ముఖేశ్ - విక్రమ్‌ తో ఉత్తమ్ సమావేశమై కాంగ్రెస్‌ను వీడొద్దని కోరినట్టు తెలిసింది. మరోవైపు డీకే అరుణ - దామోదర రాజనర్సింహతోపాటు కొందరు కాంగ్రెస్ నేతలు ముఖేశ్ ఇంటికి వెళ్లి పార్టీ వీడొద్దని ఆయనకు నచ్చజెప్పినట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న మ‌న‌సు మార్చుకున్నారు. అంతేకాకుండా ఈనెల 13 - 14 తేదీల్లో జ‌రిగే రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌ లో ఆయ‌న క్రియాశీలంగా పాల్గొన‌న‌నున్నారు. ఏకంగా 14వ త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన గోషామ‌హల్‌ లో రాహుల్ గాంధీతో ప‌ర్య‌ట‌న కూడా ముఖేష్ గౌడ్ ఏర్పాట్లు చేయించారు. దీంతో పార్టీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించి కేసీఆర్‌ కే షాకిచ్చిన నాయ‌కుడిగా ముఖేష్ గౌడ్ నిలిచార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.