Begin typing your search above and press return to search.
ములాయం కోడలికి `పద్మావతి` సెగ!
By: Tupaki Desk | 29 Nov 2017 4:16 PM GMTప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పద్మావతి’ చిత్రంపై రాజ్ పుత్ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో రాణి పద్మినీ దేవి, అల్లావుద్దీన్ ఖిల్జీ ల మధ్య అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించి చరిత్రను వక్రీకరించారని రాజ్ పుత్ లు ఆరోపిస్తున్నారు. ఆ చిత్రంలో రాణి పద్మినీ దేవిని ఓ నర్తకి గా చూపించారని మండిపడుతున్నారు. ఆ చిత్రంలో వైరల్ అయిన `ఘూమర్` పాట పై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాటలో, చిత్రంలో నర్తించిన దీపిక తలపై నజరానా కూడా ప్రకటించారు. తాజాగా, ఆ పాటను ఓ ప్రైవేటు కార్యక్రమం సందర్భంగా ఓ సెలబ్రిటీ నర్తించారు. దీంతో, ఆమెపై కర్ణిసేన, హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.
సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ స్వతహాగా మంచి సింగర్. ఆమె తన సోదరుడి నిశ్చితార్థ వేడుకలో రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి 'ఘూమర్' పాటకు పాటకు స్టెప్పులు వేశారు. ఈ వేడుక గత వారం లక్నోలో జరిగింది. తాజాగా, ఆ వీడియో బయటకు రావడంతో పెను దుమారం రేగింది. ఆ వివాదాస్పద చిత్రంలోని పాటకు అపర్ణ డ్యాన్స్ చేసి హిందువులు సిగ్గు పడేలా చేసిందని కర్ణిసేనతోపాటు కొన్ని హిందూ సంస్థలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే, ఈ వివాదంపై అపర్ణ తండ్రి, ఉత్తరప్రదేశ్ సమాచార కమిషనర్ అరవింద్ సింగ్ వివరణ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తిగత వేడుకల్లో జానపద, సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం సాధారణ విషయమని, అదే కోవలో ఘూమర్ పాటను అపర్ణ ఎంచుకుందని చెప్పారు. తమకు పద్మావతి చిత్రంతో, దాని చుట్టు జరుగుతున్న వివాదంతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.