Begin typing your search above and press return to search.
ములాయం ఇంట్లో ముసలం వెనుక రెండో భార్య?
By: Tupaki Desk | 21 Oct 2016 8:13 AM GMTఉత్తర్ ప్రదేశ్ ను ఏలుతున్న సైకిల్ గుర్తు పార్టీ సమాజ్ వాదికి కొద్దికాలంగా కష్టాలు వెంటాడుతున్నాయి. రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎలా ఉన్నా రాజకీయ పోరుకు కుటుంబపోరు తోడవడంతో కొద్దికాలంగా అక్కడ అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్ ను ఆయన తండ్రి, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ములాయం తమ్ముళ్లలో ఒకరు అఖిలేశ్ వైపు ఉండగా మరొకరిని ములాయం గట్టిగా సమర్థిస్తున్నారు. దీంతో ములాయం మద్దతు ఉన్న ఆయన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, ములాయం కుమారుడు అఖిలేశ్ మధ్య వివాదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త పేరు తెరపైకి రావడంతో ఇష్యూ మరింత ముదురుతోంది. తాజాగా ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. పెద్ద భార్య కుమారుడైన అఖిలేశ్ ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించిందంటంటూ అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించడంతో మంటలు మొదలయ్యాయి.
ఉదయ్ వీర్ పార్టీ చీఫ్ ములాయం కు ఏకంగా లేఖ రాసి మరీ సాధనపై ఆరోపణలు చేశారు. శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. 'ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ'ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు.
కాగా సాధనా గుప్తా.. ములాయం సింగ్ యాదవ్ కు రెండో భార్య. ములాయం పరివారంలో సాధనది 'ఫస్ట్ లేడీ' పోస్టే. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో పెళ్లివరకు వెళ్లారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. వీరికి 1988లో జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు విమర్శలు అధికమవుతున్నాయి. దీనిపై ఏకంగా అధినేతకు లేఖ రాయడం.. అది బహిర్గతం కావడంతో ఏం జరగబోతోందో చూడాలి.