Begin typing your search above and press return to search.
ఆ పెద్దమనిషిలో బలుపుకోణం బయటపడింది
By: Tupaki Desk | 17 May 2017 10:23 AM GMTకారణం ఏదైనా.. బాహుబలి 2 ఏదోలా వార్తల్లోకి ఎక్కుతోంది. రికార్డు కలెక్షన్లతో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను ప్రముఖులు సైతం మిస్ కాకుండా చూస్తున్నారు. ఇలా చూసే క్రమంలో తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యారు. యూపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సమాజ్ వాదీ ఛరిష్మా మసకబారింది.
ఓవైపు పార్టీ ఓడిందన్న బాధతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ములాయం అండ్ కోకు.. అనుకోని రీతిలో కష్టాలు వచ్చి పడుతున్నాయి. మొన్నటికి మొన్న ములాయం ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం ఒక అంశమైతే.. లక్షల్లో కరెంటు బిల్లుల్ని ఎగ్గొట్టిన వైనం బయటకు వచ్చి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.
యూపీ అధికారపీఠం మీద కూర్చున్న ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ తనదైన శైలితో పేరు ప్రఖ్యాతుల్ని అంతకంతకూ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. వీఐపీ కల్చర్‌కు దూరంగా ఉంటూ.. సాదాసీదాగా వ్యవహరిస్తున్న ఆయన తీరు యూపీతో పాటు.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. చేతిలో పవర్ లేకున్నా.. దర్జాకు ఏ మాత్రం తగ్గని ములాయం తీరును ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్నారు.
తాజాగా లక్నోలోని గోమ్తినగర్ లోని ములాయం సింగ్.. ఆయన సోదరుడు శివపాల్ యాదవ్.. ఇతర అధికారులు కలిసి బాహుబలి 2 మూవీని చూసేందుకు వెళ్లారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆయనకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారి వెనుకనే నిలబడి ఉన్న ఫోటో బయటకు వచ్చి పెద్ద దుమారంగా మారింది. అధికారం చేజారినా ఇప్పటికీ వీవీఐపీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదని కొందరు మండిపడితే.. ఇప్పటికీ ఇదే తీరా? మారరా? అన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫోటోను ప్రముఖ పాత్రికేయుడు శ్రీనివాసన్ జైన్ షేర్ చేస్తూ.. కమాండో నాన్ స్టాప్ గా మూడు గంటలపాటు నిలబడ్డారని.. సెక్యూరిటీ ప్రోటోకాల్ లో అంతసేపు నిలబడటం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ ఫోటో వైరల్ గా మారటమే కాదు.. ములాయం తీరును పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు.