Begin typing your search above and press return to search.
ఇంటగెలిస్తే చాలు అనుకుంటున్న వృద్ధసింహం!
By: Tupaki Desk | 8 Sep 2015 4:07 AM GMTజాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ యాదవ్ ఎంతటి కీలకమైన నాయకుడో అందరికీ తెలుసు. భాజపా, కాంగ్రెసేతర జనతా పార్టీలను కూటమిగా ఉంచడంలో.. వారందరికీ సంధానకర్తగా వ్యవహరించడంలోనూ.. ములాయం పాత్ర ప్రతిసారీ చాలా కీలకంగామారుతూ ఉంటుంది. అలాంటి ములాయం సింగ్ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో చురుగ్గా తన పాత్ర నిర్వర్తించడానికి అక్కడ జనతా పార్టీల కూటమిని గట్టున పడేయడంలో తాను బాధ్యత తీసుకోవడానికి విముఖంగా కనిపిస్తున్నారు. జనతా పరివార్ లో భాగస్వామిగా ఉంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను మట్టి కరిపించేలా పోరాడాలనే ఎజెండాకు ఆయన దూరం అవుతున్నారు. ముందు యూపీలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో.. తన సొంత ఇల్లు చక్కదిద్దుకుంటే చాలునని.. ఇంట గెలిచి రచ్చగెలవాలని ఆయన అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
'జనతా పరివార్' అంటూ ఆ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి బీహార్ ఎన్నికల్లో భాజపాను ఓడించాలని ఇదివరకు ప్లాన్ చేసుకున్నాయి. అయితే దీన్నుంచి ములాయం తప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. ముందు తమ సొంత రాష్ట్రంలో మోడీ హవాను అడ్డుకుని, భాజపా బీఎస్పీలు అధికారంలోకి రాకుండా తమ పవర్ నిలబెట్టుకుంటే చాలని ములాయం అనుకుంటున్నారట. ఆ ఫోకస్ పెంచడానికే బీహార్ ఎన్నికల భారం నుంచి తప్పించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు మిగిలిన పార్టీలు ములాయం మళ్లీ కలిసి వస్తారని ఆశిస్తున్నారు గానీ.. అక్కడ యూపీలో పార్టీ స్థితిపై ఆయనకు ఆందోళన ఉన్నదట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే తమ పార్టీ గెలిచే చాన్సులేదని పార్టీనేతలే చెబుతుండగా ములాయం పూర్తి దృష్టి అక్కడే పెట్టదలచుకున్నారు.
అయితే.. ములాయం ముందరికాళ్లకు బంధం వేసి ఇలా సొంత రాష్ట్రానికి కట్టడి చేసేయడం అనేది.. నిజానికి మోడీ సాధించిన విజయంగా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే.. యాదవ్ ,ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ములాయం సింగ్ కూడా కీలకంగా ఉంటారు. అలాంటి నేత బీహార్ ఎన్నికల్లో కూటమికి లాభిస్తుంది. అయితే ఆయన సొంతరాష్ట్రం యూపీలో తన సొంత పార్టీ పరిస్థితి గురించి ఆయన బెంబేలెత్తిపోయే వాతావరణం సృష్టించడం ద్వారా ఇది మోడీ సాధించిన విజయం అంటున్నారు. మొత్తానికి ప్రత్యర్థుల్లో ఐక్యతను దెబ్బకొట్టడమే బీహార్ లో మోడీ తొలివిజయం అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే హవాను ఆయన ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి