Begin typing your search above and press return to search.

రాజకీయాలను ఫుల్లుగా వాడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   1 Nov 2016 4:48 PM GMT
రాజకీయాలను ఫుల్లుగా వాడుకుంటున్నారు
X
ఒకే కుటుంబం నుంచి 17 మంది ఏకకాలంలో వివిధ రాజకీయ పదవుల్లో ఉంటే..! ఆశ్చర్యంగా ఉన్నా ఇది. నిజం. ఉత్తర్ ప్రదేశ్ లో ములాయంసింగ్ యాదవ్ కుటుంబం నుంచి ఏకంగా 17 మంది వివిధ పదవుల్లో ఉన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కుటుంబ పాల‌న‌... రాజ‌కీయ వార‌స‌త్వం క‌నిపిస్తున్నా స‌మాజ్‌ వాది పార్టీలో అది మ‌రింత ఎక్కువ‌గా ఉంది. జాతీయ స్థాయిలోనూ నెహ్రూ కుటుంబం నుంచి ఎక్కువ మందే ఉన్నప్పటికీ ఏక‌కాలంలో రాజ‌కీయ ప‌ద‌వుల్లో ఉన్నవారు.. పొలిటిక‌ల్ గా యాక్టివ్ గా ఉన్నవారు కొద్దిమందే. కానీ, ములాయం కుటుంబం ప‌రిస్థితి వేరు. 17 మంది స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో పదవుల్లో ఉన్నారు. దేశంలోనే ఇంకే రాజ‌కీయ కుటుంబం ఇంత‌గా విస్త‌రించ‌లేదు. బ‌హుశా ప్రపంచంలోనూ ఇంకెవ‌రూ లేరేమో.

ప్రస్తుతం ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్నవారు: 17

అందులో లోక్ స‌భ స‌భ్యులు: 4

రాజ్య స‌భ్యులు: 1

ముఖ్యమంత్రి: 1

ములాయం కుటుంబం.. రాజ‌కీయాలు

ములాయంకు ఇద్దరు భార్యలు. మొద‌టి భార్య మాల‌తీదేవి. ఆమె 2003లో మ‌ర‌ణించారు. ప్రస్తుత యూపీ సీఎం అఖిలేశ్ ఆమె కుమారుడే. రెండో భార్య సాధ‌నా గుప్తా. ములాయం త‌ర‌ఫున రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్నది ఆమే.

- మాల‌తిదేవి కుమారుడు అఖిలేశ్ సీఎం కాగా - ఆయ‌న భార్య డింపుల్ యాద‌వ్ క‌నోజ్ నియోజ‌క‌వ‌ర్గ ఎంపీ.

- సాధ‌నా గుప్తా కుమారుడు ప్రతీక్ యాద‌వ్‌ - ఆయ‌న భార్య అప‌ర్ణ యాద‌వ్‌. రానున్న ఎన్నిక‌ల్లో ల‌క్నో కంటోన్మెంట్ నుంచి స‌మాజ్ వాది పార్టీ నుంచి ఆమె పోటీ చేయ‌బోతున్నారు. ప్రతీక్ యాద‌వ్ మాత్రం రాజ‌కీయాల్లో లేరు.

- ఇక ములాయం సోద‌రుల విష‌యానికొస్తే ఆయ‌న‌కు న‌లుగురు సోద‌రులు. అందులో ర‌త‌న్ సింగ్ యాద‌వ్ మ‌ర‌ణించారు. అభ‌య్ రామ్ యాద‌వ్ వ్యవ‌సాయం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలేశ్ కు వ్యతిరేకంగా - ములాయంకు అనుకూలంగా రాజ‌కీయాలు నెరుపుతున్న శివ్ పాల్ యాద‌వ్ యూపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాజ‌పాల్ సింగ్ యాద‌వ్ మరో సోదరుడు.

- ర‌త‌న్ సింగ్ యాద‌వ్ కుమారుడు ర‌ణ‌వీర్ సింగ్ మ‌ర‌ణించారు. ఆయ‌న భార్య మృదుల జిల్లా స్థాయి రాజ‌కీయాల్లో ఉన్నారు. వారి కుమారుడు అంటే ములాయం త‌మ్ముడి మ‌న‌వ‌డు తేజ్ ప్రతాప్ సింగ్ మెయిన్ పూర్ ఎంపీగా ఉన్నారు.

- మ‌రో సోద‌రుడు అభ‌య్ రామ్ కు ఇద్దరు కుమారులు. అనురాగ్‌, ధ‌ర్మేంద్ర యాద‌వ్‌లు. కుమార్తెలు సంథ్య, షీలా యాద‌వ్. వీరిలో ధ‌ర్మేంద్ర యాద‌వ్ భార్య వంద‌న యాద‌వ్‌. ఈ బెల్టులో అనురాగ్ యాద‌వ్ ఎస్పీ యూత్ వింగ్ జాతీయ అధ్యక్షుడు. ధ‌ర్మేంద్ర యాద‌వ్ బ‌దౌన్ ఎంపీ. సంధ్యా యాద‌వ్ మెయిన్ పూర్ జ‌డ్పీ ఛైర్మన్. షీలా యాద‌వ్ మెయిన్ పూర్ జిల్లాప‌రిష‌త్ స‌భ్యురాలు.

- శివ‌పాల్ యాద‌వ్ భార్య స‌ర‌లా దేవి. కుమారుడు ఆదిత్య యాద‌వ్. స‌ర‌లా దేవి ఎటావా జిల్లా కోప‌రేటివ్ బ్యాంకు చైర్మన్. ఆదిత్యయాద‌వ్ యూపీ ప్రాదేశిక స‌హ‌కార స‌మాఖ్య చైర్మన్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు.

- రాజ్ పాల్ భార్య ప్రేమ‌ల‌తా యాద‌వ్‌. వారి కుమారుడు అభిషేక్ యాద‌వ్. ప్రేమ‌ల‌త ఎటావా మాజీ జ‌డ్పీ చైర్మన్. అభేషేక్ ప్రస్తుత చైర్మన్‌.

- వీరు కాకుండా ములాయం క‌జిన్ రాంగోపాల్ యాద‌వ్ రాజ్యస‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

- రాంగోపాల్ మేన‌ల్లుడు అర‌వింద్ ప్రతాప్ యాద‌వ్ ఎటావా-మ‌ధుర‌-మెయిన్ పూర్ ఎమ్మెల్సీగా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/