Begin typing your search above and press return to search.

అతడేమో షాజహాన్..కొడుకేమో ఔరంగజేబు

By:  Tupaki Desk   |   17 Jan 2017 5:23 AM GMT
అతడేమో షాజహాన్..కొడుకేమో ఔరంగజేబు
X
నిన్నటి కొడుకు నేడు శత్రువయ్యారు. నేతాశ్రీ.. నేతాశ్రీగా వంగి వంగి గౌరవాన్ని ప్రదర్శించి కొడుకు.. తన నుంచి పార్టీని పార్టీ గుర్తును లాక్కెళ్లిపోయినట్లుగా ఫీలవుతున్న సమాజ్ వాదీ చీఫ్ (?) ములాయం సింగ్ యాదవ్ తాజాగా బరస్ట్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ ను అఖిలేశ్ కు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న వేళ.. ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించలేనట్లుగా కనిపించిన ములాయం.. తనను తాను షాజహాన్ గా అభివర్ణించుకోవటమే కాదు.. కొడుకును ఔరంగజేబుగా చెప్పేసి తనకున్న ఆవేదనను వెల్లడించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. కొడుకు అఖిలేశ్ ను ముస్లిం వ్యతిరేకితగా అభివర్ణించేందుకు ములాయం కొత్త వాదనను తెరపైకి తీసుకురావటం గమనార్హం.

యూపీ డీజీపీగా మస్లింను నియమిస్తానని తాను హామీ ఇచ్చినప్పుడు అఖిలేశ్ తనతో 15 రోజులు మాట్లాడలేదన్న ములాయం.. అఖిలేశ్ ముస్లిం అభ్యర్థులకు సీట్లు ఇవ్వకపోటాన్ని ప్రస్తావించారు. ముస్లింలకు బద్ధశత్రువంటూ కొడుకు గురించి ములాయం చెబుతున్న మాటలన్నీ ఆయనలోని ఫక్తు రాజకీయ నేతను గుర్తుకు తెస్తున్నాయని చెప్పొచ్చు.

యూపీలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉండటమేకు.. తుది ఫలితాన్ని డిసైడ్ సత్తా ఉంది. అందుకే.. మైనార్టీలను అఖిలేశ్ కు దూరం చేయటం ద్వారా ములాయం ఆయన విజయవకాశాల్ని దెబ్బ తీసే ప్రయత్నంలో భాగంగా అఖిలేశ్ ముస్లిం వ్యతిరేకి అన్న వాదనను తెర మీదకు తెస్తున్నారని చెబుతున్నారు. అఖిలేశ్ కు విపక్షమైన బీజేపీతో సహా పలు పార్టీలకు సంబంధం ఉందన్న మాట ములాయం నోట వినిపించటం చూస్తే.. అఖిలేశ్ ను ముస్లింలకు ఎంత దూరం చేస్తే.. రాజకీయంగా అంత బలంగా దెబ్బ కొట్టొచ్చన్న ఆలోచనతోనే ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. తనను తాను షాజ్ హాన్ గా.. కొడుకును ఔరంగజేబుగా అభివర్ణించుకున్న ములాయం.. నయా భారతంలో ఔరంగజేబుకు చుక్కలు చూపించేలా నయా షాజహాన్ రాజకీయ వ్యూహం సిద్ధం చేస్తున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/