Begin typing your search above and press return to search.
ములాయం వర్సెస్ అఖిలేష్... బీజేపీకి ఆశీర్వాదం...?
By: Tupaki Desk | 21 Jan 2022 2:30 PM GMTసమాజ్ వాద్ పార్టీ అంటే ములాయం సింగ్ యాదవే అందరికీ గుర్తుకు వస్తారు. 1989లో ఆయన జనతాదళ్ లో ఉండేవారు. అప్పట్లో కేంద్రంలో విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అదే టైమ్ లో యూపీలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ గెలిచింది. నాడు అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు ములాయం సింగ్ యాదవ్. ఆయన కూడా నేషనల్ ఫ్రంట్ ఏలికలలో ఒకరుగా మూన్నాళ్ల ముచ్చటగా ముఖ్యమంత్రి పదవిని అనుభవించి వెనక్కి వెళ్తారని అంతా అనుకున్నారు.
కానీ ములాయం సింగ్ అలాంటి వారు కాదని, ఆయన ఒక ప్రబలమైన రాజకీయ శక్తి అని తరువాత కాలంలో రుజువు అయింది. ఆయన జనతాదళ్ విచ్చిన్నం తరువాత సమాజ్ వాదీ పార్టీని ఏర్పాటు చేసుకుని తరువాత కాలంలో అనేక సార్లు సీఎం అయ్యారు. ఈ రోజుకీ యూపీలో ఎస్పీకి ఒక పునాది ఉంది అంటే దాని వెనక ములాయం సింగ్ నే చెప్పుకోవాలి. పార్టీ జనాలు ఆయన్ని ప్రేమగా నేతాజీ అని పిలుస్తారు.
అలాంటి ములాయం సింగ్ ఒక దశలో దేశానికి ప్రధాని గా కూడా రేసులో ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన ములాయం జాతీయ రాజకీయాలలో కూడా కేలకంగా ఉంటూ వచ్చారు. యూపీయే ఏలుబడిలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. 2012 ఎన్నికల్లో ములాయం సింగ్ తన వారసుడిగా కుమారుడు అఖిలేష్ యాదవ్ ని ముంచు పెట్టారు.
అప్పట్లో ఎస్పీకి అన్నీ తానే అయి నడిపించారు. అలా యువ ముఖ్యమంత్రిగా అఖిలేష్ దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి నాడు సీఎం అయ్యారు. ఆ తరువాతనే ములాయం కి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆయన ప్రభ ఎక్కడా లేకుండా అఖిలేష్ చక్రం తిప్పేసారు అని చెబుతారు. ఈ పరిణామాల మధ్యనే ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ సైతం 2017 ఎన్నికల వేళ ఎస్పీ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయిదేళ్ల పాలనలో చేసిన పొరపాట్లు తప్పిదాల వల్ల అఖిలేష్ యాదవ్ 2017లో ఓడిపోయారు.
ఇక గత అయిదేళ్లలో ఆయన రాజకీయ పరిపక్వత సాధించి అందరినీ కలుపుకుపోతున్నారు అన్న కలర్ అయితే ఇచ్చారు. అలా బాబాయ్ తో గ్యాప్ తగ్గించుకున్నారు. కానీ ములాయం సింగ్ రెండవ భార్య సాధనా గుప్తాతోనూ తమ్ముడు ప్రతీక్ యాదవ్ తోనూ విభేధాలు అలాగే ఉన్నాయి. ఫలితంగానే ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ బీజేపీలో చేరి లక్నో నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ములాయం తోడల్లుడు అయిన ప్రమోద్ గుప్తా కూడా ఎస్పీని వీడి బీజేపీలో చేరిపోయారు.
ఈ సందర్భంగా ఆయన చేస్తున్న విమర్శలు సంచలనం రేపుతున్నాయి. ములాయం ని అఖిలేష్ బంధీగా చేసి ఉంచారని, ఆయన్ని అసలు మాట్లాడనీయడంలేదని కూడా ఆరోపించారు. ములాయం సింగ్ ని బయటకు రానీయడం లేదని కూడా అంటున్నారు. ఇక ఎస్పీలో నేరస్థులకే పెద్ద పీట వేస్తూ పార్టీ ఆశయాలను అఖిలేష్ తుంగలోకి తొక్కుతున్నాడు అని ఆరోపించారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే బీజేపీకి జంప్ చేసిన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మామయ్య ములాయం సింగ్ ఆశీర్వాదం తీసుకోవడం. అపర్ణా యాదవ్ బీజేపీలోకి వెళ్ళిన వేళ అఖిలేష్ యాదవ్ ఆమె మీద గట్టిగానే విమర్శలు చేశారు. ములాయం సింగ్ ఆమెను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నినారని కూదా చెప్పుకొచ్చారు. మరి మామ తనను ఆశీర్వదిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి మరి అపర్ణా యాదవ్ చేస్తున్న ప్రచారంలో అఖిలేష్ యాదవ్ కి ఇబ్బందే అని చెప్పాలి.
ఇవన్నీ పక్కన పెడితే ములాయం సింగ్ ని పక్కన పెట్టేసి అఖిలేష్ యాదవ్ సొంతంగా రాజకీయం చేయడం వల్ల ఇప్పటికే దెబ్బ తిన్నారు. మరి ఈ తడవ ఆయన గెలిస్తే ఇక ఈ కుటుంబ గొడవలు. దాయాదుల పోరాటాలూ ఉండవు. ఒక వేళ ఎస్పీ ఓడిపోతే మాత్రం అఖిలేష్ పొలిటికల్ కేరీర్ కూడా బిగ్ ట్రబుల్స్ లో పడడం ఖాయం. అపుడు కచ్చితంగా ములాయం సింగ్ రంగంలోకి దిగుతారు అంటున్నారు. చూడాలి మరి.