Begin typing your search above and press return to search.
ప్రతిపక్షం కూడా రిగ్గింగ్ చేస్తోందట
By: Tupaki Desk | 24 Oct 2016 1:19 PM GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఘాటు విమర్శల్లో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మండిపడ్డారు. వారుమెంబర్ కూడా గెలిపించలేకపోయిన రఘువీరా టీడీపీపై - ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం, ఆయన మిడిమిడి జ్ఞానానికి నిదర్శనమని ద్వజమెత్తారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రఘువీరా కాంగ్రెస్ ముసుగులో వైసీపీ భజన చేస్తున్నారన్నారు. రఘువీరా - వైసీపీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వలే వ్యవహరిస్తూ, ఆ పార్టీని రక్షించడానికి తన వంతు పాత్ర పోషిస్తున్నారని ముల్లపూడి రేణుక వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా బ్యాలెట్ బండారం ఏమిటో సోషల్ మీడియాలో అందరూ చూశారని రేణుక వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్వహించింది ప్రజా బ్యాలెట్ కాదు - కాంగ్రెస్ కార్యకర్తల రిగ్గింగ్ బ్యాలెట్ అని ఆమె ఎద్దేవా చేశారు. రఘువీరా పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పాదయాత్ర కాదు. ప్రజల పాదాలు కడిగే యాత్ర చేయాలని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కళ్లకు కనిపించడం లేదా? టీడీపీ పై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఉందో ఆయన చెప్పగలరా? అంటూ నిలదీశారు. ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత లేదని ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ చంద్రన్న బాట కింద వేసిన సిమెంట్ రోడ్లు - రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మందికి ఇస్తున్న పింఛన్లు - 80 లక్షల మందికి డ్వాక్రా రుణమాఫీ - 57 లక్షల మంది రైతులకు చేసిన రుణమాఫీతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని రేణుక విశ్లేషించారు. కోటిన్నర మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా కల్పించినందుకు టీడీపీ పై వ్యతిరేకత ఉంటుందా? నీటి భద్రతలో భాగంగా - పంటకుంటలు - చెరువుల తవ్వకం చేసినందుకా..? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపర భగీరథుడిలా పట్టిసీమ పూర్తిచేసినందుకు వ్యతిరేకిస్తారా? అంటూ రేణుక ప్రశ్నల వర్షం కురిపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/