Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మాల్స్ పై మళ్లీ దాడులు...
By: Tupaki Desk | 3 Jun 2018 5:22 PM GMTహైదరాబాద్ లో మల్టీప్లెక్స్‌ల విషయంలో మరిన్ని అవాక్కయ్యే విషయం వచ్చింది. నగరంలోని సినీ మల్టీప్లెక్స్ లపై ఏకకాలంలో తూనికలు - కొలతల శాఖ అధికారుల దాడులు జరిపారు. తినుబండారాలు - శీతల పానీయాలతో పాటు ఇతరు ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఐమ్యాక్స్ లో దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట - అమీర్ పేట్ - దిల్ సుఖ్ నగర్ - శామీర్ పేట్ - కూకట్ పల్లి - మాదాపూర్ - బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.ఎమ్మార్పీ కంటె అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై 8 కేసులు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా మల్టిప్లెక్సులలో వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయడం, తూకంలో తేడాలపై వస్తున్న ఫిర్యాదులపై తూనికల కొలతల శాఖ తీవ్రంగా స్పందించింది. సినిమా థియేటర్లలలో ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో ఎంఆర్‌పీకి ఆధికంగా వస్తులు చేస్తున్నారని, క్వాంటిటీలో తేడాలు ఉన్నాయనీ ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై తూనికల కొలతల శాఖ ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలోని మల్టీఫ్లెక్స్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇందు కోసం తూనికల తొలకతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 105 కేసులు నమోదు చేయగా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 8 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోనూ అధికారులు తనిఖీలు చేసి పలు దుకాణాలపై కేసులు నమోదుచేశారు. కేఎఫ్ సీ - పీవీఆర్ సినిమా - సబ్ వే - బర్గర్ కింగ్ రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు. మల్టీఫ్లెక్స్ లలో మోసాలపై వినియోగదారులు 7330774444 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అకున్ సభర్వాల్ తెలిపారు. వినియోగదారులు మోసపోకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా భావించాలని అధికారులకు స్పష్టం చేశారు.