Begin typing your search above and press return to search.

ముంబ‌యిలోనూ త‌క్కువ ఖ‌ర్చుతో బ‌తికేయొచ్చు

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:30 PM GMT
ముంబ‌యిలోనూ త‌క్కువ ఖ‌ర్చుతో బ‌తికేయొచ్చు
X
ముంబ‌యి అంటే విలాస‌వంత‌మైన న‌గ‌రం... ఇండియాలో ఫ్యాష‌న్ కు ప్ర‌ధాన కేంద్రం... అంతేకాదు భార‌త వ్యాపార రాజ‌ధానీ అదే.. ఇన్ని హంగులున్న ముంబ‌యి అంటే సామాన్యులు బ‌త‌క‌డం ఎంత‌క‌ష్ట‌మో అనుకోవ‌ద్దు.... భార‌త‌దేశంలో పేద‌వారు నివ‌సించ‌డానికీ అత్యంత అనుకూల‌మైన న‌గ‌రం అదేన‌ట‌.. అవును.... భార‌త్ లోనే కాదు, ప్ర‌పంచంలోనే అత్యంత చౌకైన న‌గ‌రం ముంబ‌యేన‌ట‌.. తాజాగా ఓ అధ్య‌య‌నంలో తేలిన వాస్త‌వ‌మిది.

ప్రపంచంలో అత్యంత చౌకైన నగరంగా ముంబ‌యి గుర్తింపు పొందింది. సవిల్స్ వరల్డ్ రిసెర్చ్ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌గ‌రాల్లో జీవ‌న స్థితిగ‌తులు, ధ‌ర‌ల ప‌రిస్థితులు అధ్య‌య‌నం చేసి వెల్ల‌డించిన నివేదిక‌లో ముంబ‌యిని అత్యంత చౌక న‌గ‌రంగా పేర్కొంది. లండన్ - హాంకాంగ్ - న్యూయార్క్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా పేర్కొన్న ఈ నివేదిక‌లో ముంబ‌యిని సాస్థా సిటీగా తేల్చింది. న్యూయార్క్ - హాంకాంగ్ - సీడ్ని ప్రపంచ నగరాలకు ఉన్న ఔనత్యం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ భారత్ లోని ఈ మహానగరానికి వర్తించాయని తమ సర్వేలో తెలిందని ఆ సంస్థ వెల్ల‌డించింది.

న్యూయార్క్ - హాంకాంగ్ - సీడ్ని నగరాల్లో ఉద్యోగులకు వసతులు కల్పించడానికి ఆయా సంస్థలు భారీగా ఖర్చు చేస్తున్నాయట‌... లండన్ లో ఖ‌ర్చు అంతాఇంతాకాద‌ట‌. అది అన్ని న‌గ‌రాల్లోకీ అత్యంత ఖ‌రీదైన‌ద‌ట‌. చౌకైన నగరాల్లో కంటే ఖరీదైన నగరాల్లో జీడీపీ ఐదురెట్లు ఆధికంగా ఉంటుంది.... ప్రపంచంలో 12 కాస్మోపాలిటిన్ నగరాలను లెక్క‌లోకి తీసుకుని చేసిన ఈ స‌ర్వేలో ముంబ‌యిని జీవించ‌డానికి, ప‌నిచేసుకోవ‌డానికి ది బెస్ట్ సిటీగా తేల్చారు.

ముంబ‌యిలో ఆకాశ హ‌ర్మ్యాలు ఉన్నట్లే మురికివాడ‌లూ పెద్ద సంఖ్య‌లో ఉంటాయి. అక్కడ ప‌ది రూపాయ‌ల‌తోనూ క‌డుపు నింపుకోవ‌చ్చు... ప‌ది వేల రూపాయ‌లు పెట్టీ తిండి తినొచ్చు. ఎక్క‌డి నుంచి ఎవ‌రొచ్చినా నాలుగైదు రోజుల్లోనే ప‌ని వెతుక్కోవ‌చ్చు. అందుకే కాస్మోపోలిట‌న్ న‌గ‌రాల్లో ముంబ‌యి చౌక కాస్మోపాలిట‌న్ గా గుర్తింపు పొందింది.