Begin typing your search above and press return to search.
ముంబై డాన్ కూతురితో పెళ్లి.. ఆడు మగాడ్రా బుజ్జి!
By: Tupaki Desk | 9 May 2020 11:30 PM GMTపెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటారు. ఆపాలని చూసినా కొన్ని ఆగవు. ఓవైపు కరోనా కల్లోలంతో వరుసగా సెలబ్రిటీలంతా పెళ్లి వేడుకల్ని వాయిదా వేసుకుంటుంటే ఆయన మాత్రం అస్సలు ఆగలేదు. ఆడు మగాడ్రా బుజ్జి! అన్న తీరుగా పెట్టిన ముహూర్తానికే పెళ్లాడేస్తున్నాడు. ఇంతకీ ఎవరీయన? అంటే.. పేరు అక్షయ్ వాఘమరే. ప్రముఖ నటుడు. ఇంతకీ ఎవరిని పెళ్లాడాడు? అంటే.. ముంబై డాన్ డాన్ అరుణ్ గాలివి కూతురు యోగితను పెళ్లాడుతున్నాడు నేడు.
ఈ జంటకు డిసెంబర్ లో నిశ్చితార్ధం జరిగింది. మార్చి 29న పెళ్లి ఫిక్సయ్యింది. కానీ ఈలోగానే కరోనా లాక్ డౌన్ తో ప్లానింగ్ అంతా చెడింది. వివాహం ఐదునక్షత్రాల హోటల్లో అంగరంగ వైభవంగా జరగాలని అనుకుంటే అంతా తేడా కొట్టింది. అయినా పెళ్లిని మాత్రం ఆపలేదు. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లిని సింపుల్ గా చేసేస్తున్నారు. అందుకు పోలీసులు అనుమతించారట. పూణేలో ఈ వివాహం నేడు జరగనుంది. గురువారం సాయంత్రం హల్దీ వేడుక కూడా పూర్తయింది. ఇక పెళ్లి సింపుల్ గా పూర్తి చేయనున్నారు. ముంబై డాన్ అరుణ్ గాలివి మర్డర్ కేసులో యావజీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు.
అన్నట్టు ఇంతకుముందు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి వారసుడు హీరో నిఖిల్ సిద్ధార్థ్ పెళ్లి వేడుకపై రాద్ధాంతం గురించి సంగతి తెలిసిందే. ఓవైపు కరోనా టెన్షన్ పెట్టేస్తుంటే అదేమీ పట్టనట్టు కనీసం మాస్కులు కూడా లేకుండా భారీ అథిధుల మధ్య ఈ వేడుకను చేసుకున్నారు. దీనిపై పోలీస్ కేసు నమోదైంది. ఇలాంటి రిస్కులేవీ అవసరం లేదనుకునే హీరోలు నిఖిల్.. నితిన్ పెళ్లి వేడుకల్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం సెలబ్రిటీలే కాదు.. సామాన్య ప్రజలు పెళ్లిని ఇప్పటికి వాయిదా వేసుకుని తదుపరి ముహూర్తాల కోసం వేచి చూస్తున్నారు.