Begin typing your search above and press return to search.
ముంబై మళ్లీ కొట్టేసింది 'టాప్'
By: Tupaki Desk | 17 Oct 2020 5:30 AM GMTఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కి తిరుగే లేకుండా పోయింది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న ఆ జట్టు శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. మరో వైపు వరుస పరాజయాలతో అల్లాడుతూ చివరికి కెప్టెన్ ని మార్చినా కోల్ కతా కథ మారలేదు. బ్యాట్స్ మెన్ వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది., 61 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాలోపడింది. ప్యాట్ కమిన్స్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), ఇయాన్ మోర్గాన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేకేఆర్ టాపార్డర్ చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది.
ఛేదనలో క్వింటన్ డికాక్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలగడంతో ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. డికాక్‌కు తోడుగా రోహిత్ శర్మ(36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), హార్దిక్ పాండ్యా(11 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరగా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. మరొకవైపు ఇరుజట్లు తలపడిన చివరి 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు ముంబై నే విజయం వరించింది.
నాలుగు మ్యాచ్ లు..మూడు ఫిఫ్టీలు
ముంబై బ్యాట్స్ మెన్ డికాక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా అన్ని మ్యాచ్ లలో అద్భుతంగా ఆడుతున్నాడు. డికాక్ కు నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడో హాఫ్ సెంచరీ.
కమిన్స్ తొలి అర్ధ సెంచరీ
కేకేఆర్ కష్టాల్లో పడ్డ సమయంలో కెప్టెన్ మోర్గాన్‌కు కమిన్స్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసిన తర్వాత కేకేఆర్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ముందుగా సాగింది. మోర్గాన్ మెల్లగా ఆడినా కమిన్స్ మాత్రం మెరుపులు మెరిపించాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్‌లో కమిన్స్‌కు తొలి హాఫ్ సెంచరీ.