Begin typing your search above and press return to search.

మునిగిపోబోతున్న ముంబై .. త్వరగా దుకాణం సర్దేయండి

By:  Tupaki Desk   |   31 Oct 2019 10:16 AM GMT
మునిగిపోబోతున్న ముంబై .. త్వరగా దుకాణం సర్దేయండి
X
ముంబై దేశ ఆర్థిక రాజధాని. అక్కడ నిత్యం కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అటువంటి ఈ నగరం త్వరలోనే నీట మునిగిపోబోతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.దీనికి ప్రధాన కారణం ముంబై సముద్ర తీరం వెంబడి ఉండటమే. రోజురోజుకి పెరిగిపోతున్న సముద్ర మట్టాల ప్రభావంతో 2050 క‌ల్లా ముంబై తీర ప్రాంతం అంతా నీట మున‌గ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

క్లై మేట్ సెంట్రల్ కు చెందిన స్కాట్ ఏ కల్ప్, బెంజమిన్ హెచ్ స్ట్రాస్ చేసిన పరిశోధనలో ఈ భయంకరమైన నిజాలు బయపడ్డాయి. అలాగే ఇప్పుడు వేసిన అంచనాల కంటే ..ఆ ప్రమాదం మరింత భయానకంగా ఉంటుంది అని తెలిపింది.ప్రతి ఏడాదికి పెరిగిపోతున్న వరదల తాకిడికి సౌత్ ముంబైలోని చాలా వరకు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని - వాతావ‌ర‌ణ మార్పుల‌ను అవగాహన చేసుకోకుంటే భారీ ప్రమాదం తప్పదని తేల్చింది.

2050 నాటికి 34 కోట్ల మంది వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలలో నివాసం ఉంటారని - అలాగే ఈ శతాబ్దం చివరినాటికి ఆ సంఖ్య 63 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.మొత్తంగా ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 25 కోట్ల మంది వరదల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రాంతాలలో నివసిస్తున్నారని పరిశోధన తెలిపింది. భీక‌ర వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ ప్రమాదం బారిన పడే ప్రాంతాల్లోని 70 శాతం మంది ప్రజలు చైనా - బంగ్లాదేశ్ - భారత్ - వియత్నాం - ఇండోనేషియా - థాయిలాండ్ - ఫిలిప్పీన్స్ - జపాన్ దేశాలలోనే ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది.