Begin typing your search above and press return to search.

కన్న కూతురినే కడతేర్చిన కసాయి తండ్రి..!

By:  Tupaki Desk   |   10 Dec 2019 11:56 AM GMT
కన్న కూతురినే కడతేర్చిన కసాయి తండ్రి..!
X
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన దారుణాలే. భర్త ని చంపిన భార్య - భార్యని చంపిన భర్త - తండ్రిని చంపిన కొడుకు , కొడుకుకి చంపిన తండ్రి..కూతురిని చంపిన తండ్రి ..ప్రేమ కోసం తండ్రిని చంపిన కూతురు...పొద్దున్న లేచినప్పటి నుండి ఇవే వార్తలు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని కూతరు చెప్పడంతో ఆ తండ్రి కన్నా కూతురు అని కూడా చూడకుండా చంపేసి ..ముక్కలు ముక్కలుగా చేసి - సూట్ కేసులో పెట్టాడు. ఆ తరువాత బాడీని అక్కడినుండి తీసుకోని పోవడానికి ఆటో లో వెళ్తున్న సమయంలో ..దుర్వాసన రావడంతో ఆ డ్రైవర్ అందులో ఏముంది అని ప్రశ్నించగా ....ఆటో దిగి పారిపోయాడు. సూట్ ‌కేసులో నుంచి దుర్వాసన వస్తుండటంతో డ్రైవర్ తెరిచి చూడగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ సూట్‌కేసులో ఏముంది..? వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన ముంబైకి సమీపంలోని థానేలో చోటుచేసుకుంది.

ఒళ్లు గొగురుపొడ్చే ఈ సంఘటన థానే నగరం ఉలిక్కి పడింది. సొంత కూతురునే పొట్టనబెట్టుకున్నాడు ఓ తండ్రి. ప్రేమించిన వ్యక్తిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని కూతరు చెప్పడంతో జీర్ణించుకోలేని తండ్రి ఆమెను హత్యచేశాడు. హత్య చేశాక ఏం చేయాలి అని చాలాసేపు ఆలోచించాడు. వెంటనే కూతురు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. శరీరాన్ని మూడు ముక్కలుగా విభజించి ఆపై ముక్కలు ముక్కలుగా కోసేశాడు. సూట్‌కేసులో ఆ శరీర విడిభాగాలను పెట్టాడు. ఇక మృతురాలి విడిభాగాలను సూట్‌ కేసులో ఉంచి ఓ ఆటో మాట్లాడుకున్నాడు. ఆటోలోకి ఎక్కి కాస్త దూరం ప్రయాణించగానే ఏదో దుర్వాసన వచ్చింది.

వెంటనే సూట్‌ కేసులో ఏముందని ఆటో డ్రైవర్ ప్రశ్నించగా... ఆ తండ్రి సూట్‌ కేసును ఆటోలోనే వదిలి పరుగులు తీశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆటో డ్రైవర్. అయితే మృతురాలు కానీ, నిందితుడు కానీ ఎలాంటి క్లూలు ఇవ్వకుండా పారిపోవడంతో థానే క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. విచారణ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడు అరవింద్ తివారి అని గుర్తించారు. తిత్వాలా ప్రాంతంలో నివాసముంటున్నట్లు చెప్పారు. నిందితుడిని గుర్తించడంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. కల్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగి నిందితుడు పారిపోయాడు.

అక్కడి నుంచి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మృతురాలు నాలుగు నెలల క్రితమే తన సొంత ఊరు అయిన జాన్‌ పూర్ నుంచి తిట్వాలాకు వచ్చిందని పోలీసులు తెలిపారు. నిందితుడు తిట్వాలాలో నివాసముంటుండగా అతని భార్య మరో నలుగురు కుమార్తెలు జాన్‌ పూర్‌ లో ఉంటున్నారు. మృతురాలు డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక్కడే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని చెప్పారు. దీనితో తండ్రి - కూతుర్ల మధ్య వివాదం మొదలైంది అని - ఆ తరువాత ఆమెని హత్య చేసాడని పోలీసులు తెలిపారు.