Begin typing your search above and press return to search.
ముస్లిం తెచ్చాడని వద్దన్నాడు..కస్టమర్ జైలుకి..!
By: Tupaki Desk | 23 April 2020 3:40 PM GMTకరోనాకు మతాన్ని అంటగడుతున్న జాఢ్యం సమాజంలో పేరుకుపోతుంది. కరోనా వైరస్ కు ఫలానా మతం వారని.. కులం వారని పట్టింపుల్లేవు.. అందరికీ సోకుతుంది.. చంపేస్తుంది. కానీ ఒక మతస్థుల ద్వారానే కరోనా పెరిగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని జనాలు కూడా నమ్మేస్తూ వికృతంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా ముంబైలో కరోనా వైరస్ పెరిగిపోవడంతో నిత్యావసరాలను డోర్ డెలివరీకి అధికారులు అనుమతిస్తున్నారు. తాజాగా పలు ఆన్ లైన్ సంస్థలు డోర్ డెలివరీ సేవలను ముంబైలో అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ డెలివరీ బాయ్ నిత్యవసరాలను తీసుకొచ్చి ఇంటిలో ఇచ్చాడు. కానీ ఊహించని పరిణామానికి షాక్ అయ్యాడు.
డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో ఆ సామాన్లు తీసుకోవడానికి కస్టమర్ నిరాకరించాడు. వాటిని రిటర్న్ చేయమని చెప్పాడు. మీ మతం వ్యక్తుల నుంచి సరుకులు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో డెలివరీ బాయ్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ తతంగమంతా సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
కాగా తను చేతికి గ్లౌజ్ - ముఖానికి మాస్క్ వంటి రక్షణ చర్యలు పాటించానని.. అయినా కూడా వేరే మతానికి చెందిన వాడినని సరుకులు తీసుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కస్టమర్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.