Begin typing your search above and press return to search.
అవేంజర్స్ తో అవగాహన.. పోలీసుల కొత్త ప్రయోగం
By: Tupaki Desk | 15 May 2020 4:45 AM GMTజనాలకు ఎలా చెబితే బాగా ఎక్కుతుందో తెలుసా?.. అంత్యంత ఇష్టమైన వ్యాపకంతో.. ఇష్టమైన వారితో చెబితే ఇట్టే వైరల్ అవుతుంది.. జనాలు పాటిస్తారు. అందుకే మన స్టార్ హీరోలతో సమాజహితమైన పిలుపులను పోలీసులు ఇప్పిస్తుంటారు. జనాలకు అవగాహన కల్పించేందుకు సినిమాలను వాడుకుంటారు.
ముంబై పోలీసులు కూడా అదే చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి గత ఏడాది రికార్డులు నెలకొల్పిన ‘అవేంజర్స్ -ఎండ్ గేమ్’ తో ముంబై పోలీసులు అవగాహన కల్పించారు.
అవేంజర్స్ ఎండ్ గేమ్ లోని ఒక సరదా సన్నివేశాన్ని ఇందుకోసం తీసుకున్నారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో వ్యాప్తి అవుతున్న ఫేక్ న్యూస్ లను ఉద్దేశించి అలాంటి పనులు తాము చేయమని సూచిస్తూ ‘అవేంజర్స్ ’ సినిమాలోని ఫన్నీ నమస్కారం సీన్ ను షేర్ చేశారు. గౌరవార్థం నమస్యారం చేసే ఆ సీన్ లో యువరాజు తాము ఇలాంటివి ఏమీ చేయము అంటూ సెటైర్ వేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని షేక్ హ్యాండ్ లతో వైరస్ వ్యాప్తిపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రజలను అలెర్ట్ చేసేలా తీర్చిదిద్దిన ఈ ‘అవేంజర్స్’ ఫొటో వైరల్ అవుతోంది.