Begin typing your search above and press return to search.

ముంబై ఉగ్రదాడుల సూత్రధారికి నేటికి శిక్ష!

By:  Tupaki Desk   |   25 Jun 2022 11:30 AM GMT
ముంబై ఉగ్రదాడుల సూత్రధారికి నేటికి శిక్ష!
X
26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి సాజిద్ మజీద్ మీర్ కు ఎట్టకేలకు పాపం పండింది. తాజాగా పాకిస్తాన్ కోర్టు అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష వేసింది. 2008 ముంబై దాడుదల ప్రధాన నిర్వాహకుడు అయిన నిషేధిత లష్కరే తోయిబా కార్యకర్త సాజిద్ మజీద్ టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాక్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

పంజాబ్ పోలీస్ కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేసిన ఈ కేసులో జైలులో జరుగుతున్న ఇన్ కెమెరా ప్రోసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు.

40 ఏళ్ల మధ్యలో ఉన్న దోషి మీర్ ఈ ఏప్రిల్ లో అరెస్ట్ అయినప్పటి నుంచి కోట్ లఖ్ పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు. కోర్టు దోషికి రూ.4 లక్షల జరిమానా కూడా విధించిందని న్యాయవాది తెలిపారు.

166మందిని పొట్టనబెట్టుకున్న 26/11 ముంబై దాడుల్లో సాజిద్ మీర్ భారతదేశం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నాడు. మీర్ ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు. మీర్ 2005వ సంవత్సరంలో మారుపేరుతో నకిలీ పాస్ పోర్ట్ ను ఉపయోగించి భారతదేశాన్ని సందర్శించినట్టు సమాచారం.

పాకిస్తాన్ లోని రావల్పిండిలో జీవిస్తున్న సాజిద్.. మళ్లీ ఉగ్ర కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మరోసారి ఉగ్ర దాడులకు పన్నాగం పన్నుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా, వర్జీనియా, అమెరికా, ఫ్రాన్స్ లలో ఉగ్రదాడులకు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం.

సాజిద్ బతికే ఉన్నా ముంబై పేలుళ్ల మరో సూత్రధారి మసూద్ అజార్ జాడ మాత్రం కరువైంది. మసూద్ బహవాల్ పూర్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మసూద్ జాడపై ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు.

మోస్ట్ వాంటెడ్ సాజిద్ మీర్ కోసం భారత్, అమెరికా గత కొన్ని ఏళ్లుగా వెతుకుతున్నాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సాజిద్ మీర్ కు సంబంధం ఉంది. ఈ సాజిద్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం భారత్ లోకి టూరిస్టుగా వచ్చి వెళ్లారని సమాచారం.