Begin typing your search above and press return to search.
ముంబైలో షాకింగ్ యాక్సిడెంట్...వైరల్ వీడియో!
By: Tupaki Desk | 25 Oct 2017 1:08 PM GMTముంబైలో ఓ మహిళ అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షణాల్లోనే ఓ మహిళ విగత జీవిగా మారడం స్థానికం కలకలం రేపింది. స్కూటర్ పై వెళ్తున్న ఓ మహిళ అదుపు తప్పి కింద పడింది. ఆ వెంటనే ఆమెపై నుంచి వేరే వాహనం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ దుర్ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖార్గార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ముంబైలో సుజాత పూరి(34) అనే మహిళ తన రోజువారీ విధులు నిర్వర్తించుకొని ఇంటికి బయలుదేరింది. ఆమె నెరుల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. స్కూటర్ పై ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. దీంతో, కాలు కింద పెట్టి బండిని ఆపే ప్రయత్నం చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ వెంటనే క్షణాల్లో ఆమె స్కూటర్ పక్కనే ప్రయాణిస్తున్న ఎక్స్ కవేటర్ (జేసీబీ) ఆమెపై నుంచి వెళ్లింది. ఆ వాహనం ఆమె తలపై నుంచి వెళ్లడంతో సుజాత అక్కికడ్కడే ప్రాణాలు కోల్పోయింది. చూస్తుండగానే క్షణాల్లో ఆ మహిళ విగతజీవిగా మారడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆ ఘటన ప్రత్యక్ష సాక్షులు చలించిపోయారు. ఎక్స్ కవేటర్ (జేసీబీ) డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, రోడ్డు సరిగా లేకపోవడం వల్లే కుదుపునకు లోనై ఈ దుర్ఘటన జరిగిందనన్న వాదనలు విన్పిస్తున్నాయి. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.