Begin typing your search above and press return to search.

వైసీపీలో మున్సిపల్ పదవుల చిచ్చు.. రగులుతున్న అసంతృప్తులు

By:  Tupaki Desk   |   21 March 2021 12:30 AM GMT
వైసీపీలో మున్సిపల్ పదవుల చిచ్చు.. రగులుతున్న అసంతృప్తులు
X
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పాలకవర్గాలన్నింటిని కొలువుదీర్చింది. అయితే అఖండ విజయాన్ని చేకూర్చినా పార్టీలో మాత్రం పదవులు దక్కలేదని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి.

మున్సిపాలిటీలకు సంబంధించిన పదవుల కేటాయింపు అధికార వైసీపీలో చిచ్చు రేపుతోంది. కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లో పదవులపై పంచాయతీ బాహాటంగా బయటపడుతోంది. డబ్బు ఇచ్చిన వారికే పదవులు ఇచ్చారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు కీలక నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. పార్టీ ఆరంభం నుంచి కష్టపడిన తమకు పదవులు ఇవ్వకుండా అనుభవం లేని వారికి పదవులు కట్టబెట్టారని వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధిష్టానం మాత్రం సామాజిక కోణంలో పదవులు కట్టబెట్టామని.. అణగారిన వర్గాలకు అందలం ఎక్కించామని చెబుతోంది. అనంత కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ గా ప్రచారంలో ఉన్న వసీం కు మేయర్ పదవిని కట్టబెట్టి, మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డిలకు కనీసం డిప్యూటీ మీరు కూడా ఇవ్వకపోవడంతో అక్కడ అసమ్మతి భగ్గుమంది. కళ్యాణదుర్గం, హిందూపురంలోనూ ఇలానే చాలామందికి పదవులు ఇస్తామని ఆశ చూపి అనూహ్యంగా పదవులను వేరొకరికి కట్టబెట్టడంతో దుమారం రేగింది.

ఇక విశాఖలో ఇప్పటికే మేయర్ పదవి ఇస్తానని జగన్ మోసం చేశాడని వంశీకృష్ణ అనే కార్పొరేటర్ వైసీపీకి రాజీనామా చేశాడు. జమ్మలమడుగులోనూ ఇదే పరిస్థితి. అసలు పదవులును ఆశించిన రేసులో వారికి పదవులు కట్టబెట్టడం ప్రధానంగా కనిపిస్తోంది. కొందరు ఆందోళన బాటపడితే.. మరికొందరు బాహాటంగా ముఖ్య నాయకులపై విరుచుకుపడ్డారు.