Begin typing your search above and press return to search.

కొంపల్లిలో కరోనా కలకలం...హోటల్ గదిని పరిశీలించిన మున్సిపల్‌ కమిషనర్‌!

By:  Tupaki Desk   |   5 March 2020 8:15 AM GMT
కొంపల్లిలో కరోనా కలకలం...హోటల్ గదిని పరిశీలించిన మున్సిపల్‌ కమిషనర్‌!
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. గత రెండు రోజుల నుండి హైదరాబాద్ లో కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం తో నగర వాసులు బయంగుప్పిట్లో బిక్కిబిక్కుమంటున్నారు. కనీసం , పక్కవారితో ఎక్కువ సేపు మాట్లాడే దైర్యం కూడా చేయడంలేదు. గాంధీ ఆసుపత్రిలో కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డ్ లో అనుమానితలని పెట్టి , వారి రక్త నమూనాలని పరిశీలిస్తున్నారు. అలాగే పూణేకి కూడా పంపిస్తున్నారు.

ఇక బుధవారం మైండ్ స్పేస్ లోని ఒక ఉద్యోగికి కరోనా సోకింది అనే వార్త బయటకి రావడంతో హైటెక్ సిటీ , మాదాపూర్ ప్రాంతాలలోని ప్రజలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే , ఆ ఉద్యోగికి కరోనా సోకింది అని నిర్దారణ కాలేదు అని , కేవలం అనుమానిత కేసు అని , ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇక తాజాగా మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కరోనా సోకినా మహిళా మూడు రోజుల పటు జన సంచారంలో తిరిగి , ప్రస్తుతం గాంధీ లో చికిత్స తీసుకుంటుంది అని తెలియడంతో అందరిలో మరో టెంక్షన్ మొదలైంది.

అసలు విషయం ఏమిటంటే ...ఈ మద్యే ఇటలీ నుండి వచ్చిన ఒక మహిళ కొంపల్లి జాతీయ రహదారి సినీ ప్లానెట్‌ సమీపంలో ఉన్న ఓ హోటల్‌ లో మూడు రోజుల పాటు బస చేసి,తాజాగా కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరడంతో స్థానిక ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వార్త ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఇదే విషయంపై జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో బుధవారం , ఆమె బస చేసిన హోటల్‌ ను , అలాగే ఆమె ఉన్నా రూమ్ ని కూడా పరిశీలించడానికి కొందరు అధికారులు వెళ్లారు. అయితే, హోటల్‌ అధికారులు అందుకు సహకరించకపోవడంతో స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ఎంఎన్‌ ఆర్‌ జ్యోతి జోక్యం చేసుకుని పేట్‌ బషీరాబాద్‌ ఎస్‌ ఐ పురుషోత్తమ్‌ తో కలిసి ఆమె బస చేసిన హోటల్‌ మొత్తాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు.