Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ vs అరవింద్: నిజామాబాద్ షాక్ ఎవరికి?

By:  Tupaki Desk   |   25 Jan 2020 9:45 AM GMT
టీఆర్ఎస్ vs అరవింద్: నిజామాబాద్ షాక్ ఎవరికి?
X
తెలంగాణ వ్యాప్తంగా కారు జోరు కొనసాగుతుండగా.. ఆ జోరును నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ మాత్రం అడ్డుకున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితను ఓడగొట్టి సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. తాజా మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీని అత్యధిక స్థానాలు దక్కించుకున్నపార్టీ గా నిలిపారు.

మధ్యాహ్నం 3 గంటల వరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 60 కార్పొరేటర్ స్తానాలున్నాయి. మేజిక్ ఫిగర్ 31 వస్తే వారిదే మేయర్ పీఠం. ఈ నేపథ్యంలోనే బీజేపీకి అత్యధికంగా 21 సీట్లు వచ్చాయి. అధికార టీఆర్ఎస్ ఇక్కడ పూర్తిగా వెనుకబడడం విశేషం. బీజేపీ చేతిలో దెబ్బైపోయిన టీఆర్ఎస్ పరిస్థితి చూసి టీఆర్ఎస్ శ్రేణులు కలత చెందుతున్నాయి.

నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ 21 సీట్లు సాధించ గా.. టీఆర్ఎస్ 13, ఎంఐఎం 13 సీట్లతో సరిసమానంగా నిలిచాయి. మరో 13 సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ 31కి ఏ పార్టీ దగ్గరకు రాక పోవడం తో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుకు రెడీ అయ్యాయి. 2014లోనూ ఇలానే పొత్తు పెట్టుకొని నిజామాబాద్ లో ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు అధికారం పంచుకున్నాయి. పూర్తి ఫలితాలు వచ్చాక కానీ క్లారిటీ వచ్చేలా లేదు.