Begin typing your search above and press return to search.
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన మునిసిపల్ పోలింగ్
By: Tupaki Desk | 10 March 2021 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో బుధవారం జరిగిన మునిసిపల్ ఎన్నికలు.. చదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 దాటిని తర్వాత కూడా కొనసాగింది. నిర్ణీత సమయం వరకూ క్యూ లైన్లో ఉన్నవారిని గడువు దాటిన తర్వాత కూడా ఓటింగ్ కు అనుమతించారు.
ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం నాటికి వేగం పుంజుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్లలో పోలింగ్ సాధారణంగానే నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి.
ఇక, రాష్ట్రంలో పలు చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అధికార, విపక్షాలకు చెందిన కార్యకర్తలు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే.. పోలీసులు సకాలంలో స్పందించి, తగిన చర్యలు తీసుకోవడంతో వివాదాలు సద్దుమణిగాయి. మొత్తంగా ఏపీలో మునిసిపల్ పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.