Begin typing your search above and press return to search.
కరోనా: మాస్క్ పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది.. రూ.1000 ఫైన్ !
By: Tupaki Desk | 24 April 2020 2:00 PM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. తెలంగాణలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మాస్క్ ధరించడం తప్పనిసరి అని , కనీసం కర్చీఫ్ అయినా కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఇప్పటికీ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ వేసుకోవడం లేదు.
సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాలో ఇద్దరు మున్సిపల్ సిబ్బంది మాస్క్ ధరించకపోవడంతో.. మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం వేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిద్దరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా.. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.
కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 27 కొత్త కేసులు నమోదవగా.. ఒకరు చనిపోయారు. జీహెచ్ ఎం సీ పరిధిలో 13 మంది, గద్వాలలో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 970కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 262 మంది కోలుకున్నారు. మొత్తంగా 25 మంది మరణించారు. రాష్ట్రంలో 693 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.