Begin typing your search above and press return to search.
నేతలకు డిమాండ్ పెరిగిపోతోందా ?
By: Tupaki Desk | 21 Sep 2022 2:30 AM GMTమునుగోడు ఉపఎన్నిక ఎప్పుడొస్తుందో తెలీదు కానీ అన్ని పార్టీల్లోనూ అయోమయం మాత్రం పెరిగిపోతోంది. ఏ నేత ఏ రోజు ఏపార్టీలో ఉంటారో మరుసటిరోజు ఏ పార్టీలో కనిపిస్తారో ఎవరు చెప్పలేకపోతున్నారు.
ఉప ఎన్నికల్లో గెలవటం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్టగా మారిపోయింది. దాంతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ద్వితీయ స్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవాలని పార్టీలు డిసైడ్ అయ్యాయి. దాంతో మండలస్ధాయితో పాటు గ్రామస్ధాయి నేతలకు ఫుల్లు డిమాండ్ పెరిగిపోతోంది.
విచిత్రం ఏమిటంటే మూడు పార్టీల్లోని నేతలకు మూడు పార్టీలూ గాలమేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఎరేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు టీఆర్ఎస్, బీజేపీలోని నేతలకు గాలమేస్తున్నారు. ఇదే సమయంలో అధికారపార్టీ పై రెండు పార్టీల్లోని ద్వితీయశ్రేణి నేతలను ప్రలోభాలకు గురిచేస్తోంది.
నేతల స్ధాయిని బట్టి ఒక్కొక్కళ్ళకు తక్కువలో తక్కువ రు. 10 లక్షల వరకు ఆఫర్ పలుకుతోందట. త్రిముఖ పోటీలో గెలిచే అభ్యర్ధిగా పెద్దగా మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు గట్టిగా ఉన్నాయి. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆర్ధిక, అంగబలాల్లో చాలా గట్టోడే. పైగా ఉపఎన్నికకు కారణం కూడా ఆయనే. లేనిపోని ప్రతిష్టకు పోయి కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యాడు.
అవసరం లేకపోయినా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉపఎన్నికకు కోమటిరెడ్డి కారణమయ్యాడనే మంట కాంగ్రెస్ నేతల్లో, కార్యకర్తల్లో బాగా కనబడుతోంది. అందుకనే మాజీ ఎంఎల్ఏతో పాటు ఎక్కువమంది బీజేపీలో చేరలేదు.
దాంతో మాజీ ఎంఎల్ఏ అనుకున్నదొకటి ఇపుడు అవుతున్నది మరొకటిగా పరిస్ధితి తయారైంది. అందుకనే రాజగోపాలరెడ్డి లో టెన్షన్ పెరిగిపోయి ద్వితీయశ్రేణి నేతల కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి గెలుపుకోసం అన్ని పార్టీల నేతలకు గాలమేస్తుండటంతో ఫుల్లు డిమాండ్ పెరిగిపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.