Begin typing your search above and press return to search.
మునుగోడు కాంగ్రెస్ సెమీఫైనల్.. నిలుస్తుందా? లేదా?
By: Tupaki Desk | 11 Aug 2022 3:37 PM GMTమొన్నటి వరకు ‘మునుగోడు’ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణ అంతటా ఈ నియోజకవర్గం గురించే చర్చ.. ఇక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే బీజేపీలో చేరనున్నారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీలో చేరిన తరువాత రాజగోపాల్ రెడ్డి తిరి పోటీ చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. ఆ పార్టీలోకి వెళ్లిన వారు గెలుపు సాధ్యమని కొందరు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ తరుపున పోటీ చేసి మునుగోడు ఉప ఎన్నికలో గెలుస్తానని అంటున్నాడు. అంతకుముందు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి అలవోకగా గెలిచారు. ఇప్పుడు తాను కూడా ఈజీగా గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అయితే ఈటలకు సాధ్యమైన గెలుపు.. రాజగోపాల్ రెడ్డికి సాధ్యమవ్వడం కష్టమేనంటున్నారు.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వెనుక టీఆర్ఎస్, బీజేపీ కుట్ర దాగి ఉందా? అందుకే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ఈ ఎన్నిక తెచ్చాయా? కాంగ్రెస్ ను తెలంగాణలో లేకుండా చేసే కుట్రనా? అంటే కాంగ్రెస్ వాదులు ఔననే అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఇక కాంగ్రెస్ పని ఖతమేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆరోపణలతో అదే రుజువైంది.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉందనే వాతావరణం తెచ్చేందుకు ఇరుపార్టీలు ఒప్పందంతో కొనసాగుతున్నాయని మధుయాష్కీ ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ సెమీఫైనల్ గా భావిస్తుందని పేర్కొన్నారు. ఈనెల 13న మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో ఓడిపోతే ఇక తెలంగాణలో కనుమరుగైనట్టే. అందుకే ఈ ఎన్నికను కాంగ్రెస్ వాదులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి 2018లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు. 2014లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ 2018లో మరిన్ని సీట్లు గెలుచుకుంది. ఇంతటి హవాలోనూ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కేడర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు పట్టుంది. అందుకే ఇప్పటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ పార్టీని వీడిపోలేదు. వీరు కాంగ్రెస్ ను వీడిపోతే గెలిచే అవకాశం లేదనే ఇంతకాలం పార్టీలో కొనసాగారు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరారు. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళితే అయన వెంటే వచ్చేది చాలా తక్కువ మందే అన్న చర్చ సాగుతోంది. అందుకే నల్గొండ ఖిల్లా అయిన కాంగ్రెస్ కు ఈ సీటు చావోరేవో.. అందుకే దీన్ని గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుంది?