Begin typing your search above and press return to search.
తులం బంగారం కాదు కానీ కారు ఇచ్చిందెంత? పువ్వు ఇచ్చిందెంత?
By: Tupaki Desk | 5 Nov 2022 12:30 PM GMTదేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా ప్రచారం జరిగిన మునుగోడు ఉప పోరు వేళ.. ప్రధాన పార్టీలు పోటాపోటీగా డబ్బుల పంపిణీ సాగినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒకరు మునుగోడు ఓటర్లను రోడ్ల మీద ఆపి మరీ మాటలు కదిపారు. ఓటు వేసినందుకు ఎంత ఇచ్చారు? అన్న విషయాన్ని అడిగితే.. వారు అంతే ఓపెన్ గా తాము తీసుకున్న డబ్బుల లెక్కను చెప్పేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
పలువురు మహిళల్ని.. ఒకరిద్దరు పురుషులను ఉప ఎన్నిక సందర్భంగా పార్టీల నుంచి తీసుకున్న డబ్బుల లెక్కను బయటకు చెప్పేందుకు అస్సలు వెనుకాడలేదు. వారి మాటల్ని విన్నంతనే.. విలువల గురించి.. డబ్బులు పెట్టి నేతల్ని కొనటమా? ఇదెంత అన్యాయం అంటూ గుండెలు బాదేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చప్పున గుర్తుకు రాక మానదు.
విలువల గురించి అంత భారీగా మాట్లాడిన పెద్దమనిషి.. తమ పార్టీ తరఫున ఓటర్లను కొనుగోలు చేసేందుకు పంచిన డబ్బుల లెక్కల్ని చూసినప్పుడు.. మాటలకు, చేతలకు మధ్యనున్న తేడా ఇట్టే అర్థం కాక మానదు.
ఇంతకూ ఉప ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేసేందుకు ఓటర్లకు టీఆర్ఎస్ నేతలు పంచిన పంపకాల గురించి కెమేరా సాక్షిగా ఓపెన్ అయిపోయారు. ఒక మహిళ మాట్లాడుతూ.. తొలుత టీఆర్ఎస్ వాళ్లు (కారు పార్టీ వాళ్లు) రూ.3వేలు.. మళ్లీ రెండోసారి రూ.2వేలు చొప్పున ఓటుకు పంపారని చెప్పారు. అయితే.. ఈ ఉప ఎన్నిక సందర్భంగా తులం బంగారాన్ని ఇంటికి పంచుతారని చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదని తేలింది.
ఇక.. పువ్వు గుర్తు విషయానికి వస్తే.. రూ.4వేలు ఇచ్చినట్లుగా పలువురు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీధుల్లోకి మైకు పట్టుకొని తిరిగేటోళ్లకు సైతం మొహమాట పడకుండా తమ మనసులోని మాటల్ని చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.
కారు గుర్తు.. పువ్వు గుర్తుల వారు తమకు రూ.5 వేల.. రూ.4వేలు చొప్పున ఇచ్చారని.. అదే సమయంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. కేఏ పాల్ సైతం డబ్బులు తీయలేదన్న అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. ఇదంతా విన్నప్పుడు.. ఓట్ల కొనుగోలు విషయంలో అధికార టీఆర్ఎస్.. విపక్ష కమలనాథుల తీరును కళ్లకు కట్టినట్లుగా చెప్పేస్తున్న సామాన్యల మాటలకైనా బుద్ది వస్తుందని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.