Begin typing your search above and press return to search.
'డబ్బులు ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి' మునుగోడులో వాట్సాప్ స్టేటస్ ఇదే బ్రో!
By: Tupaki Desk | 11 Oct 2022 4:30 PM GMTజనాల నోళ్లలో ఏదైనా నానితే.. ఇక, అంతే! దానిని నిలువరించడం.. అంత తేలిక అయితే కాదు. ఇప్పుడు లలితా జ్యుయలరీ సంస్థ అధినేత కిరణ్ కుమార్.. తరచుగా తన ప్రకటనలో చేసే.. ఒక నినాదం తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడులో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం అందరి వాట్సాప్ స్టేటస్‌గా కూడా ఈ నినాదం మారిపోయింది.
అదే.. `డబ్బులు ఊరికే రావు` అనే స్లోగన్. అయితే.. దీనికి మునుగోడుప్రజలు.. మరో కామెంట్ కూడా జోడించారు.. అదేంటంటే..``ఉప ఎన్నికలు వస్తే వస్తాయి!`` అని!! ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను దుమ్మురేపుతోంది.
ఎందుకంటే.. నిన్న మొన్నటివరకు అసలు మునుగోడు నియోజకవర్గం మొహం చూసిన నాయకులకానీ.. పార్టీలు కానీ లేవు. ఇక్కడ ప్రజుల ఏమైనా పట్టించుకోలేదు. కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలు.. నేతలు.. రెక్కలు కట్టుకుని మరీ ఇక్కడ వాలిపోయారు. హామీలపై హామీలు గుప్పిస్తున్నారు. ఇక, ఎన్నికలకు ఇంకా.. 20 రోజుల సమయం ఉండగానే ఓట్లను కొనేస్తున్నారు. అడిగిన వారికి.. అడగని వారికి.. అన్నట్టుగా.. ఇక్కడ పార్టీలు పందేరం చేస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు అభివృద్ధికి కూడా పైసలు లేవన్న అధికార పార్టీ నుంచి కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ వరకు అందరూ.. కూడా.. ఇక్కడి ఓటర్లకు వేలకు వేలు పంచేస్తున్నాయి. ఓటుకు ఇంతని ఒకప్పుడు ఇచ్చేవారు.. ఇప్పుడు లెక్కలు మారాయి. ఓటుకు ఎంతైనా ఇస్తున్నారు. అడిగిన వారికి అడిగినంత లెక్క! సో.. దీంతో ఇక్కడ డబ్బుల కట్టలు.. ప్రవాహంగా పారుతున్నాయని.. వార్తలు.. వస్తున్నాయి. ప్రజల్లో గుసగుస కూడా వినిపిస్తోంది.
సో.. మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి.. అంటే.. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి.! అందుకే.. ``డబ్బులు ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తేనే వస్తాయి`` అని కామెంట్లు పేలుస్తున్నాయి. నిజమే కదా!! మామూలు రోజుల్లో అయితే.. ఎవరు పట్టించుకుంటారు?.. సో.. ప్రజలు కూడా మారారు బ్రో!! అందిన కాడికి పిండేస్తున్నారు!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.