Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ఎఫ్ఐఆర్ లో సంచలన నిజాలు
By: Tupaki Desk | 27 Oct 2022 12:32 PM GMTతెలంగాణలోని నలుగురు ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల చొప్పున ఎరవేసి ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి స్వామిలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన వెలుగుచూశాయి.
బీజేపీకి చెందిన రామచంద్రభారతి, నందకుమార్ తనను కలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయవద్దని, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని బేరసారాలు నిర్వహించారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో సంచలన విషయాలు తెలిపారు. 100 కోట్ల మొత్తాన్ని ఆఫర్ చేశారని విన్నవించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టు పనులు, ఇతర ఉన్నత కేంద్ర ప్రభుత్వ పదవులు కూడా ఇస్తానని తనకు ఎరగా వేసి బీజేపీలో చేరమన్నారని ఫిర్యాదులో తెలిపారు.
తాను బీజేపీలో చేరకపోతే క్రిమినల్ కేసులు, ఈడీ/సీబీఐ దాడులు జరుగుతాయని, టీఆర్‌ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు తెలిపారు. రాజకీయ పార్టీ నేతలకు లంచం ఇవ్వడానికి ప్రేరేపించడం అనైతికమని.. అప్రజాస్వామికం.. అవినీతిని ప్రోత్సహిస్తున్నారని.. రాజకీయాలను కలుషితం చేస్తున్నారు కాబట్టి పై వ్యక్తులకు సహకరించకూడదని నిర్ణయించుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
అక్టోబర్ 26న ఇద్దరు నిందితులు మళ్లీ రోహిత్‌రెడ్డిని సంప్రదించి మధ్యాహ్నం మొయినాబాద్‌లోని అజీజ్ నగర్‌లో గల ఫామ్‌హౌస్‌కు చర్చల కోసం వస్తున్నట్టు సమాచారం అందించారు. బీజేపీలో చేరేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు లంచం ఇచ్చేందుకు మరికొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడా సమీకరించాలని కోరారు. ఇతర ఎమ్మెల్యేలను డబ్బులు ఇస్తామని.. చేర్పించేలా చూడాలని ప్రేరేపించారు, తద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం అస్థిరమవుతుందని కూలుతుందని ప్రలోభ పెట్టారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం ద్వారా బీజేపీలో చేరే ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజి స్వామి అనే ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్‌కు వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
రోహిత్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో సైబరాబాద్ పోలీసులు ఫాంహౌస్‌కు చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని గుర్తు తెలియని ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.