Begin typing your search above and press return to search.

మునుగోడు పోల్స్: ఆ అభ్యర్థితో ప్రచారానికి రాము బాబోయ్?

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:30 PM GMT
మునుగోడు పోల్స్: ఆ అభ్యర్థితో ప్రచారానికి రాము బాబోయ్?
X
టీఆర్ఎస్ యుద్ధానికి దిగకముందే రకరకాల పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయట.. మునుగోడులో ఎంత ప్రయత్నించినా అధికార టీఆర్ఎస్ కు ఊపు రావడం లేదని అంటున్నారట.. ఇప్పటికే డీలా పడిన టీఆర్‌ఎస్‌కు మరింత షాక్‌గా మునుగోడు ఉపఎన్నిక తయారవుతోంది.

టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు సైతం ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కూసుకుంట్లకి పెద్దగా ఆదరణ లేదని పొరుగు నియోజకవర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అగ్రనేతలకు చెప్పినట్లు సమాచారం.

కూసుకుంట్ల నోరు విప్పిన ప్రతిసారీ పార్టీని హీనంగా చూపిస్తున్నారని కొందరు ముక్తకంఠంతో చెప్పారు. కూసుకుంట్ల గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈయనతో టీఆర్ఎస్ గెలుపు కష్టం అని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు . తన పత్రాలను దాఖలు చేయడానికి ముందు రోడ్ షోలో, కూసుకుంట్ల పదేపదే తడబడుతూ మాట్లాడారు.. పేర్లను తప్పుగా ఉచ్చరించాడు. కేటీఆర్ ను పట్టుకొని ఆయన నందమూరి తారక రామారావు అన్నారు.

అదేవిధంగా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, తమ్మినేని సీతారాం అంటూ మాట్లాడారు. కూసుకుంట్ల తీరుతో ఓటర్లలో నవ్వులపాలయ్యారని అంటున్నారు.. కెటిఆర్ కూడా ఎంతగా విసిగిపోయారంటే కూసుకుంట్లని జీపులో వేదిక వెనుకకు వెళ్లమని అంటున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన ముఖం చూపిస్తే ఓట్లు పడేలా లేవని అంటున్నారట..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పార్టీ క్యాడర్ నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూసుకుంట్లను కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. కూసుకుంట్ల అభ్యర్థిత్వానికి జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గట్టి పట్టుదలతో ఉండడంతో ఆయన్నే ఖాయం చేశారు. ఇప్పుడు అన్ని వైపుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గెలిపించకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుగా అవుతుందని అంటున్నారు. టీఆర్ఎస్ గెలవకపోతే మంత్రి బుక్కవ్వడం కాయమంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.