Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్త పార్టీకి భయపడే త్వరగా ‘మునుగోడు’ ఉప ఎన్నికనా?
By: Tupaki Desk | 3 Oct 2022 3:22 PM GMTతెలంగాణలో ‘మునుగోడు’ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది.అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల మంటలు అంటుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు నిర్వహించకుండా ముందే నిర్వహించడానికి కేసీఆర్ కొత్త పార్టీ భయం ఉందని తాజాగా టీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గుజరాత్ ఎన్నికలతోపాటు నిర్వహిస్తే ఇక్కడ ఓడిపోతే బీజేపీ పరువుపోతుందని ఇలా ముందుగా నిర్వహిస్తున్నారని ఆయన లాజిక్ బయటకు తీశారు.
తెలంగాణలో ఉప ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసిన బీజేపీ దీన్ని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు నిర్వహించడం లేదు. ఎందుకంటే అప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సొంత రాష్ట్రం గుజరాత్ ప్రచారంలో ఉంటారు. సొంత రాష్ట్రంలో గెలిపించుకోలేకపోతే ఇక వృథా అని వారు పట్టుదలగా ఉంటారు. అందుకే మునుగోడును దాంతోపాటు నిర్వహించకుండా ముందస్తుకు జరిపి ఇప్పుడే నిర్వహిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా చేయడం వల్ల బీజేపీకి మేలు కంటే డిఫెన్స్ లో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్ కొత్త పార్టీకి భయపడే త్వరగా షెడ్యూల్ విడుదల చేసి మమ అనిపించేలా మునుగోడును చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఓడిపోయే సీటు కాబట్టే ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు.
ఇక ఖరీదైన బట్టలు వేసుకున్న ప్రధాని మోడీ కంటే.. విమానం కొనుగోలు ఎక్కువ ఏమీ కాదని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కేసీఆర్ సంక్షేమ పథకాలే మునుగోడు గెలుపునకు నాంది అన్నారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని జగదీష్ రెడ్డి వెల్లడించారు.
ఇలా ఎన్నికలకు ముందే టీఆర్ఎస్, బీజేపీ మధ్యలో మాటల యుద్ధం నడుస్తోంది. మునుగోడును ముందుగా నిర్వహించి బీజేపీ డిఫెన్స్ లో పడిపోయిందా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో టీఆర్ఎస్ కే మేలు అన్న చర్చ కూడా మొదలైంది. మరి ఈ ఉప ఎన్నికల్లో ఏం తేలుతుందన్నది ఆసక్తిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.